పవన్ సినిమాకు ఎదురుచూసినట్లు.. ఎన్టీఆర్ మూవీకి ఏనాడైనా వెయిట్ చేశారా : టీడీపీ నేతలకు పేర్ని నాని సెటైర్లు
Send us your feedback to audioarticles@vaarta.com
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమా టికెట్ ధరలు, తదితర సమస్యలకు సంబంధించి టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణలపై మంత్రి పేర్ని నాని చురకలంటించారు. కొన్ని పార్టీలు ఆంధ్రప్రదేశ్‌లో బ్లాక్ మార్కెటింగ్‌ను ప్రోత్సహించాలని భావిస్తున్నాయని ఆయన ఆరోపించారు . మరోవైపు.. దాన్ని తప్పుబట్టాల్సిన టీవీ ఛానళ్లు కొన్ని ఒప్పుగా వార్తలను ప్రసారం చేస్తున్నాయని పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన జీవోను తాత్కాలికంగా నిలిపివేసి.. జాయింట్ కలెక్టర్ల దగ్గర అనుమతి తీసుకోమని హైకోర్టు తీర్పునిచ్చిందని మంత్రి గుర్తుచేశారు.
దానికి అనుగుణంగా మీరెందుకు చేయరు? మా ఇష్టారాజ్యం అంటే ఎలా కుదురుతుంది? ఈ నెల 21న టికెట్ ధరల విషయమై కమిటీతో భేటీ, 22న సినిమాటోగ్రఫీ హోం సెక్రటరీ జీవోకు ఓ డ్రాఫ్ట్ రూపొందించి, లా డిపార్ట్‌మెంట్‌కు పంపించటం, 23 లేదా 24న జీవో రావాల్సి వుందన్నారు. కానీ మంత్రి గౌతంరెడ్డి మరణం కారణంగా ఆలస్యమైందని.. మంచి మనిషిని కోల్పోయిన బాధలో అంతా ఉంటే జీవో రావట్లేదంటూ కొందరు విమర్శిస్తున్నారని పేర్ని నాని తెలిపారు. చావును కూడా రాజకీయాలకు వాడుకుంటున్నారని.. అలాంటి వారిని ఏమనాలని మంత్రి ప్రశ్నించారు.
గౌతమ్‌రెడ్డి మరణించిన రోజు ఒకలా మాట్లాడిన వారు తర్వాత రోజు నుంచి మరో విధంగా మాట్లాడుతున్నారు. రాజకీయం కోసం దిగజారే చంద్రబాబులాంటి వారికి మనిషి విలువ తెలియదని పేర్నినాని ఎద్దేవా చేశారు. ఎవరు చనిపోయినా వారి శవాలతో రాజకీయం చేస్తుంటారంటూ మంత్రి దుయ్యబట్టారు. గౌతమ్‌రెడ్డి మరణం కారణంగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను వాయిదా వేసుకున్నవారు సినిమాను రెండు రోజులు పోస్ట్‌పోన్ చేసుకోలేరా అని పేర్ని నాని ప్రశ్నించారు. దానికి ఆగలేనప్పుడు ప్రస్తుతమున్న నిబంధనలే వర్తిస్తాయని మంత్రి గుర్తుచేశారు. భీమ్లా నాయక్ విడుదలవ్వకముందే.. లోకేశ్ సినిమా బాగుంటుందని చెప్పారని, సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నామన్నారని పేర్ని నాని సెటైర్లు వేశారు. మరి జూనియర్ ఎన్టీఆర్ సినిమా వస్తుంటే ఇలా ఎప్పుడైనా అన్నారా అని మంత్రి ప్రశ్నించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments