Mallareddy:'బిజినెస్‌మ్యాన్' సినిమా చూసే ఎంపీనయ్యా: మంత్రి మల్లారెడ్డి
Send us your feedback to audioarticles@vaarta.com
ఇటీవల తెలంగాణ మంత్రి మల్లారెడ్డి ఏం మాట్లాడినా తెగ వైరల్ అవుతోంది. మేడ్చల్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న మల్లన్న.. ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు. అయితే సోమవారం రాత్రి మల్లారెడ్డి యూనివర్సిటీలో 'యానిమల్' ప్రీరిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్‌కు హాజరైన మల్లారెడ్డి మాట్లాడుతూ మహేష్‌బాబు గురించి మాట్లాడారు. ‘మీ సినిమా బిజినెస్‌మ్యాన్ పదిసార్లు చూశా. అది చూశాకే రాజకీయాల్లోకి వచ్చి ఎంపీనయ్యా’ అని తెలపడంతో మహేష్ తెగ నవ్వారు. ఆ తర్వాత హైదరాబాద్‌కు షిఫ్ట్ కావాలంటూ రణబీర్ కపూర్‌కు మంత్రి సలహా ఇచ్చారు. తెలుగు వాళ్లు బాలీవుడ్, హాలీవుడ్ అన్నింటినీ ఏలేస్తారన్నారు. ఈ సందర్భంగా 'యానిమల్' సినిమా బ్లాక్ బస్టర్‌గా నిలవాలని కోరుకుంటున్నట్లు మల్లారెడ్డి వెల్లడించారు.
అప్పుడు రాంగోపాల్ వర్మ.. ఇప్పుడు సందీప్ రెడ్డి..
ఇక ఈ ఈవెంట్‌కి దర్శకధీరుడు రాజమౌళి ముఖ్య అతిథిగా వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ “ప్రతి సంవత్సరం కొత్త డైరెక్టర్స్ వచ్చి సూపర్ హిట్స్ కొట్టడం మనం చూస్తూనే ఉంటాము. కానీ ఎప్పుడో ఒకసారి ఒక డైరెక్టర్ వస్తాడు. అతను ఆడియన్స్, ఇండస్ట్రీని మాత్రమే కాదు. సినిమా అంటే ఇలానే చేయాలి అనే పద్ధతిని కూడా షేక్ చేస్తాడు. అలాంటి డైరెక్టర్ సందీప్ వంగా. మా తరంలో రామ్ గోపాల్ వర్మ. ఇప్పుడు సందీప్ వంగా. నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది సందీప్” అంటూ కొనియాడారు.
తెలుగులో మాట్లాడిన అనిల్ కపూర్..
అలాగే బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ తెలుగులో మాట్లాడి అందరినీ ఆకట్టుకున్నారు. "అందరూ బాగున్నారా .. ట్రైలర్ నచ్చిందా .. ఒక యాక్టర్‌గా నాకు బర్త్ను ఇచ్చింది తెలుగు ఇండస్ట్రీ. 1980లో నేను బాపుగారి దర్శకత్వంలో 'వంశవృక్షం' సినిమాలో నటించాను. లేట్‌గా వచ్చినా లేటెస్టుగా మీ ముందుకు వచ్చాను. నిజంగా ఇది నాకు స్పెషల్ ఫీలింగ్" అని అన్నారు. మహేష్‌బాబు లాంటి ఫ్యామిలీ మేన్ .. రాజమౌళి వంటి సూపర్ డైరెక్టర్ ఈ ఫంక్షన్‌కి ముఖ్య అతిథులుగా రావడం ఆనందంగా ఉందని అనిల్ వెల్లడించారు. మొత్తానికి 'యానిమల్' ప్రీరిలీజ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments