Mallareddy: గత స్మృతులు గుర్తుచేసుకుంటూ 40ఏళ్ల నాటి స్కూటర్‌పై మంత్రి మల్లారెడ్డి చక్కర్లు
Send us your feedback to audioarticles@vaarta.com
తెలంగాణ మంత్రి మల్లారెడ్డి ఏం చేసినా వైరల్ అవుతూ ఉంటుంది. విజయదశమి సందర్భంగా ఆయన తన గత స్మృతులను గుర్తు చేసుకున్నారు. 40 ఏళ్ల క్రితం పాలు అమ్మిన స్కూటర్‌పై చక్కర్లు కొట్టారు. యువకుడిగా ఉన్న సమయంలో బోయినపల్లిలో ఏ స్కూటర్‌పై అయితే పాలు అమ్మారో.. ఆ స్కూటర్‌కు ఆయుధపూజ నిర్వహించారు. అనంతరం దానిని కాసేపు నడిపి నాటి జ్ఞాపకాలను మరోసారి నెమరేసుకున్నారు. గతంలో ఓ సందర్భంలో పాలమ్మినా.. పూలమ్మినా.. కష్టపడ్డానంటూ మల్లారెడ్డి చెప్పిన మాటలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిన సంగతి విషయం తెలిసిందే. దాంతో ఆయన తెలుగు రాష్ట్రాల్లో ఓ సెలబ్రెటీగా మారిపోయారు.
మల్లారెడ్డి ఏం మాట్లాడిన వైరల్..
అప్పటి నుంచి మల్లారెడ్డి ఏం మాట్లాడినా సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. రాజకీయ సభల్లో ఆయన వ్యాఖ్యలు అందరినీ నవ్విస్తూ ఉంటాయి. మంత్రి కేటీఆర్ సైతం మల్లన్న మాట్లాడిన తర్వాత మనం మాట్లాడటానికి ఏం ఉండదని వ్యాఖ్యానించారు. అంతలా మల్లారెడ్డి స్పీచులు ఇస్తూ ఉంటారు. కాలేజీలు, హాస్పిటల్స్, షాపింగ్ మాల్స్ పెట్టి ఎంతో మందికి ఉపాధి కల్పిస్తూ ఉన్నత స్థాయికి ఎదిగారు. అయినా కూడా గతం మర్చిపోకుండా పాలు అమ్మిన స్కూటర్‌కు పూజలు చేసి నడపడంపై నెటిజన్లు నుంచి ప్రశంసలు వస్తున్నాయి.
టీడీపీ నుంచి రాజకీయ ప్రస్థానం..
ఇక మల్లారెడ్డి రాజకీయాల విషయానికొస్తే ఆయన టీడీపీ నుంచి తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో మల్కాజ్‌గిరి ఎంపీగా పోటీ చేసి భారీ మెజార్టీతో గెలుపొందారు. తర్వాతి పరిణామాల నేపథ్యంలో 2016లో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. 2018 ఎన్నికల్లో మేడ్చల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించి మంత్రి అయ్యారు. ఇప్పుడు మరోసారి అదే సీటు నుంచి పోటీ చేస్తున్నారు. ఇక ఆయన అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి మల్కాజ్‌గిరి స్థానం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంత్‌రావుపై పోటీకి దిగారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments