KTR:సీఎం బ్రేక్‌ఫాస్ట్ పథకం ప్రారంభించిన మంత్రి కేటీఆర్.. స్వయంగా విద్యార్థులకు వడ్డించి వారితో కలిసి టిఫిన్

  • IndiaGlitz, [Friday,October 06 2023]

తెలంగాణ ప్రభుత్వం విద్యార్థుల కోసం మరో కొత్త పథకం తీసుకువచ్చింది. సికింద్రాబాద్ పరిధిలోని వెస్ట్ మారేడ్‌పల్లిలో సీఎం బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. అనంతరం పిల్లలకు స్వయంగా వడ్డించి వారితో కలిసి బ్రేక్‌ఫాస్ట్ చేశారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ చదువుకునే చిన్నారులకు నాణ్యమైన పోషకాహారం అందించాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ఈ పథకాన్ని ప్రవేశపెట్టారని వెల్లడించారు. రాష్ట్రంలోని 23 ల‌క్షల మంది పిల్లలకు ప్రతిరోజు ఉద‌యం సీఎం బ్రేక్ ఫాస్ట్ పథకం కింద అల్పాహారం అందిస్తున్నామ‌ని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 27,147 ప్రభుత్వ పాఠ‌శాల‌ల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవ‌డం సంతోషంగా ఉంద‌న్నారు.

విద్యార్థులకు నాణ్యమైన అల్పాహారం అందిస్తున్నాం..

ఇప్పటికే మ‌ధ్యాహ్నం భోజ‌నంలో భాగంగా ప్రతి విద్యార్థికి సన్నబియ్యంతో కూడిన భోజ‌నాన్ని అందిస్తున్నామ‌ని పేర్కొన్నారు. ఇప్పుడు ఉద‌యం పూట కూడా నాణ్యమైన అల్పాహారం పెడితే బాగుంటుంద‌ని సీఎం కేసీఆర్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారని వివరించారు. నాణ్యతతో కూడిన అల్పాహారాన్ని అందివ్వాల‌ని జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్‌ను కేటీఆర్ ఆదేశించారు. అలాగే అల్పాహారం ప‌థ‌కం ఎలా ఉంద‌నే నివేదిక ఇవ్వాల‌ని టీచ‌ర్లకు సూచించారు. త‌మిళ‌నాడులో ఈ కార్యక్రమాన్ని ఒక‌టో త‌ర‌గ‌తి నుంచి ఐదో త‌ర‌గ‌తి వ‌ర‌కు అమ‌లు చేస్తున్నార‌ని.. కానీ కేసీఆర్ మాత్రం మన రాష్ట్రంలో ఒక‌టో త‌ర‌గ‌తి నుంచి ప‌దో త‌ర‌గ‌తి వ‌ర‌కు అమ‌లు చేయాల‌ని నిర్ణయించారని చెప్పారు. ఈ పథకంలో ఏమైనా సమస్య ఉంటే ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని ఓ నెంబర్ కూడా ఇచ్చారు.

రంగారెడ్డి జిల్లాలో మంత్రులు హరీష్‌రావు, సబితా ప్రారంభం..

మరోవైపు రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని రావిర్యాల జిల్లాపరిషత్ పాఠశాలలో సీఎం బ్రేక్‌ఫాస్ట్‌ పథకాన్ని మంత్రులు హరీష్‌రావు, సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. అనంతరం విద్యార్థులతో కలిసి టిఫిన్ చేశారు. అటు ఉప్పల్‌లో హోంమంత్రి మహమూద్ అలీ ఈ పథకాన్ని ప్రారంభించారు. మిగిలిన జిల్లాల్లో కూడా వివిధ శాఖల మంత్రులు ఈ పథకం ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఈ అల్పాహార పథక నిర్వహణ ఆయా పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం అందించే వారికే అప్పగించారు. అయితే హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌, సంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో మాత్రం అక్షయపాత్ర సంస్థ ఈ సేవలు అందించనుంది.

More News

TSRTC:టీఎస్ఆర్టీసీ ఛైర్మన్‌గా ముత్తిరెడ్డి.. రాజయ్యకూ కీలక పదవి.. అసంతృప్తులకు ఇలా చెక్ పెట్టిన కేసీఆర్

ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో ఎమ్యెల్యే టికెట్ రాని అసంతృప్తులను చల్లార్చేందుకు గులాబీ బాస్ కేసీఆర్ విరుగుడు చర్యలు తీసుకున్నారు.

BRS, Congress:తెలంగాణలో గులాబీ పార్టీకి షాక్ ఖాయం.. కాంగ్రెస్‌దే అధికారం అంటున్న లోక్‌పోల్ సర్వే

తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఓ సర్వే ఫలితాలు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.

Bigg Boss 7 Telugu : ప్రేమ పాఠాలు చెప్పిన శుభశ్రీ.. దోస్త్ మేరా దోస్త్ అంటున్న తేజ - ప్రిన్స్ యావర్

బిగ్‌బాస్ 7 తెలుగులో ప్రస్తుతం కెప్టెన్సీ కోసం టాస్క్‌లు నడుస్తున్న సంగతి తెలిసిందే. బుధవారం జరిగిన టాస్క్‌ల్లో శివాజీ,

Pawan Kalyan:ఏపీని వైసీపీ రహిత రాష్ట్రంగా మారుస్తాం: పవన్ కల్యాణ్

ఎన్డీఏ నుంచి బయటకు వస్తే తానే చెబుతానని.. అంతేకానీ దొంగ చాటుగా బయటకు రానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.

Prema Vimanan:కల్యాణ్ రామ్ ‘డెవిల్’ నిర్మాణ సంస్థ 'ప్రేమ విమానం' ట్రెయిలర్ ను ZEE5 విడుదల

జాతీయము, అక్టోబరు 4, 2023:  భారతదేశపు అతిపెద్ద హోమ్-గ్రోన్ వీడియో ప్రసార వేదిక మరియు బహుభాషా కథకుడు, ZEE5