KTR : స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం : చంద్రబాబుకు రిమాండ్.. కేటీఆర్ పరోక్ష ట్వీట్, వైరల్

  • IndiaGlitz, [Monday,September 11 2023]

స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును సీఐడీ అరెస్ట్ చేయడం, ఆయనకు ఏసీబీ కోర్ట్ 14 రోజుల రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో అవినీతి ఆరోపణలపై జైలుకు వెళ్లిన తొలి మాజీ సీఎంగా చంద్రబాబు రికార్డుల్లోకెక్కారు. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఆయన గురించే చర్చ నడుస్తోంది. టీడీపీతో పాటు పలు పార్టీల నాయకులు చంద్రబాబు అరెస్ట్ గురించి స్పందిస్తున్నారు. ఇలా ఎవరి అభిప్రాయం వారు వెల్లడిస్తున్నారు. తాజాగా తెలంగాణ ఐటీ శాఖ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా స్పందించారు. ఈ మేరకు ఆయన పరోక్షంగా ట్వీట్ చేశారు.

వరుణ్ గ్రోవర్ చేసిన నథింగ్ మేక్స్ సెన్స్ అనే ప్రోగ్రామ్‌ను ఉద్దేశిస్తూ కేటీఆర్ ట్వీట్ చేశారు. ‘‘తాను గతంలో ఎప్పుడూ ఇలా నవ్వలేదని.. ఇలా చేసినందుకు థ్యాంక్స్ చెప్పారు. అలాగే అందరూ భావిస్తున్నట్లుగా ఇది పరోక్ష సందేశం కాదని ఆశిస్తానని. కాకూడదని కోరుకుంటాను. ఒకవేళ అయినా సరే, ఆశ్చర్యపడను, బాధపడను. జాలి పడతాను ’’ అంటూ కేటీఆర్ ట్వీట్‌లో పేర్కొన్నారు. నేరుగా స్పందించకున్నా .. చంద్రబాబు అరెస్ట్ గురించి కేటీఆర్ ఇలా పరోక్షంగా ట్వీట్ చేశారనే కామెంట్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

కాగా.. స్కిల్ డెవలప్‌మెంట్‌లో చంద్రబాబు నాయుడుకు ఈ నెల 22 వరకు జ్యుడిషియల్ కస్టడీ విధించింది ఏసీబీ కోర్ట్. దీంతో ఆయనను ఆదివారం రాత్రి అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. అర్ధరాత్రి జైలుకు చేరుకున్న ఆయనకు అధికారులు ‘‘7691’’ నెంబర్‌ను కేటాయించారు. మరోవైపు జైలులో చంద్రబాబుకు మిగిలిన ఖైదీలలాగా కాకుండా ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని ఏసీబీ కోర్ట్ ఆదేశించింది. చంద్రబాబుకు జైలులో ప్రత్యేక గది ఏర్పాటు చేయడంతో పాటు భద్రత కల్పించనున్నారు. చంద్రబాబుకు ఇంటి భోజనంతో పాటు మందులను అందజేయాలని న్యాయమూర్తి ఆదేశించారు.

More News

Chandrababu Naidu:చంద్రబాబు ఖైదీ నెంబర్ 7691.. జైలులో ప్రత్యేక వసతులు, ఇంటి భోజనానికి కోర్ట్ అనుమతి

స్కిల్ డెవలప్‌మెంట్‌లో మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఈ నెల 22 వరకు జ్యుడిషియల్ కస్టడీ విధించింది ఏసీబీ కోర్ట్.

Daggubati Purandeswari:చంద్రబాబుకు రిమాండ్ : టీడీపీ బంద్‌కు బీజేపీ మద్ధతంటూ ఫేక్ లెటర్ .. పురందేశ్వరి సీరియస్

స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఏసీబీ కోర్ట్ 14 రోజుల రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే.

Bigg Boss 7 Telugu : బిగ్‌బాస్ 7లో తొలి వికెట్ డౌన్.. ఎలిమినేటైన కిరణ్ రాథోడ్, షకీలా కన్నీరుమున్నీరు

బిగ్‌బాస్‌ 7లో సండే సందడి షురూ అయ్యింది. కింగ్ నాగార్జున వచ్చి రావడంతోనే ఆటలు, పాటలతో అలరించారు.

Chandrababu Naidu:36 గంటల ఉత్కంఠకు తెర .. చంద్రబాబుకు బిగ్‌షాక్, 14 రోజుల రిమాండ్ విధించిన కోర్ట్

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఏసీబీ కోర్ట్ షాకిచ్చింది. ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో ఆయనకు న్యాయస్థానం 14 రోజుల

Chandrababu naidu : స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ముగిసిన వాదనలు.. తీర్పు రిజర్వ్, సర్వత్రా ఉత్కంఠ

ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును సీఐడీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.