క్యాంటీన్‌లో మిత్రులను ఆటపట్టిస్తూ.. కొండ కోనలను ఎక్కేస్తూ.. కాలేజీ రోజుల్లో కేటీఆర్ ఇలా

  • IndiaGlitz, [Friday,June 02 2023]

కల్వకుంట్ల తారక రామారావు.. షార్ట్ కట్‌లో కేటీఆర్ . ఈయన గురించి తెలుగు రాష్ట్రాల్లో తెలియనివారుండరు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తగిన వారసుడిగా ఆయన రాజకీయాల్లో దూసుకెళ్తున్నారు. అందరు వారసుల్లాగా వచ్చిన వెంటనే పదవిని అందుకోకుండా.. తెలంగాణ ఉద్యమంలో తండ్రికి బాసటగా నిలిచారు. ఎన్నో పోరాటాల్లో పాల్గొని రాజకీయ నాయకుడిగా రాటుదేలారు. హాయిగా అమెరికాలో ఉద్యోగం చేసుకోకుండా రాజకీయాలు అవసరమా అన్న వాళ్లకి తన చేతలతోనే సమాధానం చెప్పారు కేటీఆర్. రాష్ట్రం ఆవిర్భవించిన నాటి నుంచి ఐటీ, పరిశ్రమలు, పురపాలక, పంచాయతీరాజ్ వంటి కీలక పదవులు చేపట్టిన కేటీఆర్.. హైదరాబాద్ నగర అభివృద్దిలో తన మార్క్ చూపిస్తున్నారు. జాతీయ, అంతర్జాతీయ సదస్సులలో పాల్గొని రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొస్తున్నారు. ప్రస్తుతం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్న కేటీఆర్.. రాబోయే రోజుల్లో సీఎం అవుతారని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి.

పూణే యూనివర్సిటీలో ఎమ్మెస్సీ చదివిన కేటీఆర్ :

వీలున్నప్పుడల్లా తన చిన్ననాటి గుర్తులు, కాలేజ్ రోజులను కేటీఆర్ గుర్తుచేసుకుంటూ వుంటారు. వాటికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంటూ వుంటారు. తాజాగా ఆయన పూణేలో బయో టెక్నాలజీలో మాస్టర్స్ చేస్తున్న రోజులను , తన మిత్రులను తలచుకున్నారు. ఈ మేరకు ఇన్‌స్టాలో పిక్స్ షేర్ చేశారు. యూనివర్సిటీ క్యాంటీన్‌లో మిత్రులతో సరదాగా గడుపుతున్న ఫోటోలతో పాటు ట్రెక్కింగ్ చేస్తున్న పిక్‌ను ఆయన షేర్ చేశారు. నూనుగు మీసాలతో ఇప్పుడు ఆయన కుమారుడు హిమాన్షు ఎలా వున్నారో కేటీఆర్ అలా వున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

తండ్రి కోసం ఉద్యోగం మానేసి .. ఉద్యమంలోకి :

ఇకపోతే.. 1976 జూలై 24న కేసీఆర్, శోభా రావు దంపతులకు కేటీఆర్ జన్మించారు. కరీంనగర్, హైదరాబాద్, గుంటూరు, పూణే, న్యూయార్క్‌లలో ఆయన విద్యాభ్యాసం గడిచింది. పూణే యూనివర్సిటీలో ఎమ్మెస్సీ బయో టెక్నాలజీ చేయగా.. సిటి యూనివర్సిటీ ఆఫ్ న్యూయార్క్‌లో ఎంబీఏ చదివారు. చదువు పూర్తయ్యాక కొద్దిరోజులు అమెరికాలోని ఓ బడా కంపెనీలో ఉద్యోగం చేసిన కేటీఆర్.. 2006లో భారతదేశానికి తిరిగి వచ్చి తండ్రి కేసీఆర్‌తో కలిసి తెలంగాణ ఉద్యమంలో పాలు పంచుకున్నారు. 2009, 2010, 2014, 2018లలో సిరిసిల్ల నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు.

More News

ఆ కల నిజం చేసుకుంటున్నాం.. తెలంగాణ బ్రదర్స్ అండ్ సిస్టర్స్‌కు శుభాకాంక్షలు: రామ్ చరణ్

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా పలువురు రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

ఎందరో పోరాట యోధుల త్యాగ ఫలం.. తెలంగాణ కీర్తి అజరామరం : జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాల సందర్భంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.

Bholaa Shankar: 'భోళా శంకర్' - భోళా మానియా ఫస్ట్ లిరికల్ జూన్ 4న

వాల్తేరు వీరయ్య విజయంతో దూసుకుపోతున్న మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం స్టైలిష్ మేకర్ మెహర్ రమేష్ దర్శకత్వంలో మెగా మాసివ్ యాక్షన్ ఎంటర్‌టైనర్

Vyuham: ఏపీ రాజకీయాలపై వర్మ 'వ్యూహం' .. వైఎస్ భారతిగా నటించేది ఈమె..?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను టార్గెట్ చేస్తూ విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తోన్న చిత్రం ‘‘వ్యూహం’’. ఏపీ సీఎం వైఎస్ జగన్ జీవితం, ఆయన పొలిటికల్ ఎంట్రీ తదితర అంశాల ఇతివృత్తంతో

GDP: ఇండియాలో జీడీపీ వృద్ధిరేటు పరుగులు.. సవాళ్ల మధ్య అసాధారణ ఫలితాలు, నిపుణులు ఏమంటున్నారంటే..?

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా ఆర్ధిక మాంద్యపు భయాలు వెంటాడుతున్న సంగతి తెలిసిందే. దిగ్గజ కంపెనీలన్నీ కాస్ట్ కాటింగ్ పేరుతో ఇప్పటికే ఉద్యోగులను తొలగిస్తున్నాయి.