KTR:రేవంత్ రెడ్డిపై మంత్రి కేటీఆర్ తీవ్ర విమర్శలు.. నోటుకు టికెట్లు అమ్ముకుంటున్నారని ఆరోపణలు
Send us your feedback to audioarticles@vaarta.com
ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో తెలంగాణలో రాకీయాలు హీటెక్కాయి. అధికార, ప్రతిపక్షాలు ఎత్తులు పైఎత్తులకు దిగాయి. ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ప్రచారాలు ముమ్మరం చేశాయి. ఈ నేపథ్యంలోనే భూపాలపల్లి జిల్లాలో పర్యటించిన మంత్రి కేటీఆర్ ఎన్నికల శంఖారావం పూరించారు. ఈ సభలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై కేటీఆర్ విమర్శలు వర్షం కురిపించారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ టికెట్లు అమ్ముకుంటున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. రేవంత్ తీరు ఓటుకు నోటు.. సీటుకు రేటు అన్నట్లు ఉందని ఎద్దేవా చేశారు. 60 ఏళ్లలో చేయని అభివృద్ధి 10ఏళ్లలో బీఆర్‌ఎస్ చేసి చూపించిందని తెలిపారు. కాంగ్రెస్ నేతల చేతిలో రాష్ట్రాన్ని పెడితే అమ్మేస్తారని వ్యాఖ్యానించారు.
ఎన్నికల తేదీలు చూస్తే మనకు కలిసి వచ్చినట్లు ఉంది..
50 ఏళ్ల పాటు అధికారం ఇస్తే ఏం చేశారని ఆయన నిలదీశారు. కాంగ్రెస్‌లో సీఎం అభ్యర్థి ఎవరో చెప్పాలని కేటీఆర్ సవాల్ విసిరారు. కాంగ్రెస్ నేతలు అధికారం కోసం ఎంతగైనా దిగజారుతాయని.. ఇక సంక్రాంతి పండుగకు గంగిరెద్దుళ్లోళ్లు వచ్చినట్లు కాంగ్రెస్ నాయకులు వస్తారన్నారు. వాళ్ల మాటలు నమ్మి ఓటు వేస్తే మన కళ్లను మనం పొడుచుకున్నట్లేనని హెచ్చరించారు. అందుచేత నవంబర్ 30న జరగనున్న ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేయాలని కేటీఆర్ కోరారు. నవంబర్ 30 ఎన్నికలు, డిసెంబర్ 3 కౌంటింగ్.. ఈ తేదీలను చూస్తుంటే ఈసారి మనకు లెక్క కూడా కుదిరినట్టు ఉందన్నారు. 30, 03, కేసీఆర్ మూడోసారి కూడా ముఖ్యమంత్రి కావడం పక్కా అనిపిస్తుందన్నారు. బీఆర్‌ఎస్‌కు అన్ని కలిసి వస్తున్నాయని.. మూడు మూడు ఆరు.. మన లక్కీ నంబర్ కూడా ఆరే అని కేటీఆర్ వెల్లడించారు.
ఈ గట్టున ఉంటారా..? ఆ గట్టున ఉంటారా..?
60 ఏళ్లలో కరెంట్ ఇవ్వని కాంగ్రెస్.. ఇప్పుడు వచ్చి అది చేస్తా.. ఇది చేస్తా అని హామీలు ఇస్తే మోసపోదామా..? ఆరు నెలల్లోనే కరెంట్ సమస్యను పరిష్కరించిన కేసీఆర్‌కు ఓటేద్దామా?.. రైతుబంధు ఇచ్చిన ఈ గట్టున ఉంటారా? రాబందుల్లా పీక్కు తిన్న ఆ గట్టునుంటారా? తేల్చుకోవాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. మొత్తానికి రాష్ట్రంలో ఎన్నికల వేడి మొదలైంది. ఓటర్లను ఆకట్టునేందుకు నేతలు ప్రచారంతో హెరెత్తిస్తు్న్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments