KTR: తెలంగాణలో మ్యూజిక్ యూనివర్సిటీ.. కేటీఆర్ ప్రతిపాదన, ఇళయరాజా గ్రీన్ సిగ్నల్
Send us your feedback to audioarticles@vaarta.com
తెలంగాణలో మ్యూజిక్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామన్నారు రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్. సీనియర్ హీరోయిన్ శ్రియా నటించిన ‘‘మ్యూజిక్ స్కూల్’’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇటీవల జరిగింది. ఈ కార్యక్రమానికి కేటీఆర్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఇదే ఈవెంట్‌కు లెజెండరీ చిత్ర దర్శకుడు ఇళయరాజా కూడా వచ్చారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ... మ్యూజికల్ యూనివర్సిటీ లాంటి ఇళయరాజాతో కలిసి ఈ వేదికను పంచుకోవడం గౌరవంగా వుందన్నారు. ఈ కార్యక్రమానికి తాను కేవలం అతిథిగానే రాలేదని.. ఎజెండాతో వచ్చానని కేటీఆర్ తెలిపారు.
కేటీఆర్ విజ్ఞప్తికి ఇళయరాజా సానుకూల స్పందన:
రాష్ట్రంలో మ్యూజిక్ యూనివర్సిటీ ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా వున్నామని మంత్రి ప్రకటించారు. ఇళయరాజా సారథ్యంలో మ్యూజిక్ యూనివర్సిటీ పెట్టాలని అనుకుంటున్నట్లు కేటీఆర్ పేర్కొన్నారు. ఆ మాటలకు వేదికపై వున్న పెద్దాయన సైతం అవాక్కయ్యారు. అంతేకాదు.. ఇందుకు తాను సిద్ధమేనన్నట్లుగా ఇళయరాజా సంకేతాలిచ్చారు. కేటీఆర్ ప్రకటనపై సినీ, సంగీత రంగాలకు చెందిన ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు.
పిల్లలకు నచ్చిన దారిలో వారిని ప్రోత్సహించాలి:
ఇక ఇదే ఈవెంట్‌లో కేటీఆర్ మాట్లాడుతూ.. ఈ చిత్ర దర్శకుడు పాపారావు తనకు సన్నిహితుడన్నారు. అధికారిగా ఎన్నో మంచి పనులు చేశారని ప్రశంసించారు. పిల్లలను డాక్టర్, ఇంజనీర్ చదవాలని ఇబ్బంది పెట్టొద్దని.. వారికి ఏది ఇష్టమో అది చదివించాలని మంత్రి పేర్కొన్నారు. తన కొడుకు హిమాన్షు కూడా అలాగే ఓ కవర్ సాంగ్ చేశాడని.. దానిని చూడగానే తనలో ఇలాంటి టాలెంట్ వుందా అని ఆశ్చర్యపోయానని కేటీఆర్ సభకు తెలిపారు. ప్రతి ఒక్కరిలో గుట్టుగా వుండే ఇలాంటి టాలెంట్‌ను వెన్నుతట్టి ప్రోత్సహించాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. అటు ఈ సినిమాకు పాపారావు దర్శకత్వం వహించగా.. ఈ నెల 12న విడుదల కానుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout