Minister KTR : కేటీఆర్ సతీమణి శైలిమా తండ్రి హరినాథ రావు కన్నుమూత

  • IndiaGlitz, [Thursday,December 29 2022]

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆయన సతీమణి శైలిమా తండ్రి హరినాథరావు కన్నుమూశారు. మంగళవారం ఆయనకు గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ హరినాథరావు కన్నుమూశారు . హరినాథరావు వయసు 72 సంవత్సరాలు. ఆయన భౌతికకాయాన్ని రాయదుర్గంలోని ఓరియన్ విల్లాస్‌లోకు తరలించినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే మంత్రి కేటీఆర్, శైలమా దంపతులు నిన్న రాత్రి నుంచి ఆసుపత్రిలోనే వున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. హరినాథరావు మరణం పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు.

రిటైర్మెంట్ తర్వాత ఇంటికే పరిమితమైన హరినాథరావు:

హరినాథరావు గతంలో డీహెచ్‌ఎఫ్‌వోగా పనిచేసి పదవీ విరమణ పొందారు. ప్రస్తుతం ఆయన రాయదుర్గంలోని ఓరియన్ విల్లాస్‌లో ప్రశాంత జీవితం గడుపుతున్నారు. ఇక కేటీఆర్, శైలిమాల వివాహం 2003 డిసెంబర్ 18న జరిగింది. ఈ దంపతులకు కుమారుడు హిమాన్షు, కుమార్తె అలేఖ్య వున్నారు. కేటీఆర్ రాజకీయాలు, పరిపాలనలో బిజీగా వుండటంతో పిల్లల బాధ్యతను శైలిమ తీసుకున్నారు. ప్రతీ విసయంలోనూ భర్తకు చేదోడు వాదోడుగా నిలుస్తున్నారు. పండుగలు, శుభకార్యాలలో తప్పించి శైలిమ పెద్దగా మీడియాలో కనిపించరు.

More News

G2: జనవరి 9న అడివి శేష్ పాన్ ఇండియా మూవీ 'G2' లాంచ్

వైవిధ్యమైన, విలక్షణమైన, ఒకదానికొకటి ప్రత్యేకమైన తన చిత్రాల తో భారీ ఫాలోయింగ్ క్రియేట్ చేశారు అడివి శేష్.

Unstoppable2: డార్లింగ్ గర్ల్‌ఫ్రెండ్స్‌‌ని లాగాలని చూసిన బాలయ్య... నాకు పెళ్లి రాసిపెట్టి లేదు : ప్రభాస్ షాకింగ్ కామెంట్స్

నటసింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ‘‘ఆహా’’లో ప్రసారమవుతోన్న అన్‌స్టాపబుల్ 2

Vallabhaneni Janardhan : మరో విలక్షణ నటుడిని కోల్పోయిన టాలీవుడ్.. గ్యాంగ్‌లీడర్‌లో ‘ఎస్పీ’వల్లభనేని జనార్థన్ కన్నుమూత

ఇప్పటికే కైకాల సత్యనారాయణ, చలపతిరావుల మరణంతో తీవ్ర విషాదంలో వున్న తెలుగు చిత్ర పరిశ్రమకు మరో షాక్ తగిలింది.

Laurus Labs Accident: లారస్ ల్యాబ్స్‌ ప్రమాదంపై పవన్ దిగ్భ్రాంతి.. ఆ పరిశ్రమల్లో సేఫ్టీ ఆడిట్ ఏది

అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీలోని లారస్ పరిశ్రమలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుని నలుగురు మరణించిన ఘటనపై జనసేన అధినేత పవన్ కల్యాణ్

Sonu Sood:సోనూ సూద్ హై యాక్షన్ థ్రిల్లర్ 'ఫతే' 2023 జనవరి లో సెట్స్

సోనూ సూద్ ఈ పేరు వింటే సామాన్యుడి పెదవిపై చిరునవ్వు విరబూస్తుంది.