Minister KTR : కేటీఆర్ సతీమణి శైలిమా తండ్రి హరినాథ రావు కన్నుమూత
Send us your feedback to audioarticles@vaarta.com
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆయన సతీమణి శైలిమా తండ్రి హరినాథరావు కన్నుమూశారు. మంగళవారం ఆయనకు గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ హరినాథరావు కన్నుమూశారు . హరినాథరావు వయసు 72 సంవత్సరాలు. ఆయన భౌతికకాయాన్ని రాయదుర్గంలోని ఓరియన్ విల్లాస్‌లోకు తరలించినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే మంత్రి కేటీఆర్, శైలమా దంపతులు నిన్న రాత్రి నుంచి ఆసుపత్రిలోనే వున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. హరినాథరావు మరణం పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు.
రిటైర్మెంట్ తర్వాత ఇంటికే పరిమితమైన హరినాథరావు:
హరినాథరావు గతంలో డీహెచ్‌ఎఫ్‌వోగా పనిచేసి పదవీ విరమణ పొందారు. ప్రస్తుతం ఆయన రాయదుర్గంలోని ఓరియన్ విల్లాస్‌లో ప్రశాంత జీవితం గడుపుతున్నారు. ఇక కేటీఆర్, శైలిమాల వివాహం 2003 డిసెంబర్ 18న జరిగింది. ఈ దంపతులకు కుమారుడు హిమాన్షు, కుమార్తె అలేఖ్య వున్నారు. కేటీఆర్ రాజకీయాలు, పరిపాలనలో బిజీగా వుండటంతో పిల్లల బాధ్యతను శైలిమ తీసుకున్నారు. ప్రతీ విసయంలోనూ భర్తకు చేదోడు వాదోడుగా నిలుస్తున్నారు. పండుగలు, శుభకార్యాలలో తప్పించి శైలిమ పెద్దగా మీడియాలో కనిపించరు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com