KTR: డ్రగ్స్ టెస్ట్ కోసం కిడ్నీ, బ్లడ్ కూడా ఇస్తా.. నువ్వు చెప్పు దెబ్బలకు సిద్ధమా: బండి సంజయ్‌కి కేటీఆర్ సవాల్
- IndiaGlitz, [Tuesday,December 20 2022]
తాను డ్రగ్స్‌కు బానిసనంటూ తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ (Bandi Sanjay) చేసిన వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు మంత్రి కేటీఆర్ (KTR). తాను డ్రగ్స్ టెస్ట్‌కు రెడీ అని ప్రకటించారు. ఇందుకోసం నా రక్తం, కిడ్నీ, బొచ్చు ఏది కావాలంటే అది ఇస్తానని పేర్కొన్నారు. తాను ఇక్కడే వుంటానని.. డాక్టర్లను తీసుకుని రావాలని కేటీఆర్ సవాల్ విసిరారు. క్లీన్‌చిట్‌తో బయటకు వస్తానని.. మరి బండి సంజయ్ కరీంనగర్ (Karimnagar) చౌరస్తాలో తనను తాను కొట్టుకుంటాడా అని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.
కరీంనగర్‌కు ఏం చేశాడు .. గావు కేకలు తప్పించి :
కరీంనగర్‌కు ఏమైనా చేశాడా.. పిచ్చి అరుపులు, గావు కేకలు , పెడబొబ్బలు తప్పించి అంటూ కేటీఆర్ ఫైర్ అయ్యారు. ఏం చేతకాదు, హౌలాగాడు, హౌలా మాటలు మాట్లాడతారంటూ ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇద్దరు గుజరాతీయులకు దేశం మొత్తం సలాం కొట్టాలా అని కేటీఆర్ ప్రశ్నించారు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ (Telangana) ఎదిగిన తీరు దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని... బండి సంజయ్ లాంటి నేతలు మాత్రం ఆ ఇద్దరు గుజరాతీ నేతలకు చెప్పులు తొడుగుతున్నారంటూ మంత్రి దుయ్యబట్టారు.
కేటీఆర్ డ్రగ్స్ (Drugs) తీసుకుంటారంటూ విపక్షాల విమర్శలు:
ఇదిలావుండగా.. కేటీఆర్ డ్రగ్స్ తీసుకుంటారంటూ తెలంగాణకు చెందిన కాంగ్రెస్ నేతలతో పాటు బండి సంజయ్ పలుమార్లు బహిరంగంగానే వ్యాఖ్యలు చేశారు. కానీ కేటీఆర్ ఎప్పుడూ వీటిపై స్పందించలేదు. అయితే విమర్శలు శృతిమించుతూ వుండటంతో మంత్రి స్పందించారు. తాను డ్రగ్స్ టెస్ట్‌కు సిద్ధమేనని బండి సంజయ్‌కి కేటీఆర్ సవాల్ విసిరారు.