KTR:ఎన్నికల ప్రచారంలో మంత్రి కేటీఆర్‌కు తప్పిన ప్రమాదం
Send us your feedback to audioarticles@vaarta.com
బీఆర్ఎస్ మంత్రి కేటీఆర్‌కు ప్రమాదం తప్పింది. ఆర్మూర్ ఎమ్మెల్యే అభ్యర్థి జీవన్ రెడ్డి నామినేషన్ సందర్భంగా నిర్వహించిన రోడ్‌షోలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ర్యాలీ పాత ఆలూరు రోడ్డు వద్దకు రాగానే ‘ప్రచార రథం’ వాహనం నుంచి జారిపడ్డారు. ప్రజలకు అభివాదం చేస్తుండగా వ్యాన్ డ్రైవర్ ఒక్కసారిగా బ్రేక్ వేయడంతో వాహనం రెయిలింగ్ ఊడిపోయింది. దీంతో కేటీఆర్ ముందుకు జారారు. అయితే కేటీఆర్‌ను గన్మెన్లు గట్టిగా పట్టుకోవడంతో స్వల్పగాయాలతో బయటపడ్డారు.
మంత్రితో పాటు ఉన్న జీవన్ రెడ్డి, మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి మాత్రం వాహనం కింద పడిపోయారు. ఈ ఘటనతో అక్కడున్న వారంతా షాక్‌కు గురయ్యారు. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ పెద్ద గాయాలు కాకపోవడంతో ప్రచారం చేస్తూనే నామినేషన్ కేంద్రానికి వెళ్లారు. కాగా అంతకుముందు సిరిసిల్ల నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న కేటీఆర్ తన నామినేషన్ పత్రాలను అధికారులకు సమర్పించారు. నామినేషన్ దాఖలుకు ముందు ఇవాళ ఉదయం ప్రగతి భవన్లో ప్రత్యేక పూజలు చేసిన కేటీఆర్ రోడ్డు మార్గాన సిరిసిల్ల వెళ్లారు. అనంతరం ఆర్మూర్‌లో నిర్వహించిన రోడ్‌షోలో పాల్గొనేందుకు హాజరయ్యారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments