KTR:ఎన్నికల ప్రచారంలో మంత్రి కేటీఆర్‌కు తప్పిన ప్రమాదం

  • IndiaGlitz, [Thursday,November 09 2023]

బీఆర్ఎస్ మంత్రి కేటీఆర్‌కు ప్రమాదం తప్పింది. ఆర్మూర్ ఎమ్మెల్యే అభ్యర్థి జీవన్ రెడ్డి నామినేషన్ సందర్భంగా నిర్వహించిన రోడ్‌షోలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ర్యాలీ పాత ఆలూరు రోడ్డు వద్దకు రాగానే ‘ప్రచార రథం’ వాహనం నుంచి జారిపడ్డారు. ప్రజలకు అభివాదం చేస్తుండగా వ్యాన్ డ్రైవర్ ఒక్కసారిగా బ్రేక్ వేయడంతో వాహనం రెయిలింగ్ ఊడిపోయింది. దీంతో కేటీఆర్‌ ముందుకు జారారు. అయితే కేటీఆర్‌ను గన్‌మెన్లు గట్టిగా పట్టుకోవడంతో స్వల్పగాయాలతో బయటపడ్డారు.

మంత్రితో పాటు ఉన్న జీవన్ రెడ్డి, మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి మాత్రం వాహనం కింద పడిపోయారు. ఈ ఘటనతో అక్కడున్న వారంతా షాక్‌కు గురయ్యారు. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ పెద్ద గాయాలు కాకపోవడంతో ప్రచారం చేస్తూనే నామినేషన్‌ కేంద్రానికి వెళ్లారు. కాగా అంతకుముందు సిరిసిల్ల నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీచేస్తున్న కేటీఆర్ త‌న నామినేష‌న్ ప‌త్రాలను అధికారులకు సమర్పించారు. నామినేషన్ దాఖలుకు ముందు ఇవాళ ఉదయం ప్రగ‌తి భ‌వ‌న్‌లో ప్రత్యేక పూజ‌లు చేసిన కేటీఆర్ రోడ్డు మార్గాన సిరిసిల్ల వెళ్లారు. అనంతరం ఆర్మూర్‌లో నిర్వహించిన రోడ్‌షోలో పాల్గొనేందుకు హాజరయ్యారు.

More News

Samantha:అనారోగ్యం, విడాకులు.. ఇలా ఒక్కసారిగా సమస్యలు చుట్టుముట్టాయి: సమంత

స్టార్ హీరోయిన్ సమంత తన వ్యక్తిగత జీవితంతో పాటు వృత్తిపరమైన జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నానని ఆవేదన వ్యక్తం చేశారు.

Chandrababu:చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం

స్కిల్‌ డెవలప్‌మెంట్ కేసులో మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై సుప్రీంకోర్టు తీర్పు వాయిదా వేసింది.

CM KCR:గజ్వేల్‌లో నామినేషన్ వేసిన సీఎం కేసీఆర్..

తెలంగాణ ఎన్నికల్లో నామినేషన్ల అంఖం తుది దశకు చేరుకుంది. రేపటితో నామినేషన్ల దాఖలుకు గడువు ముగియనుంది.

Bigg Boss Telugu 7 : హగ్గులు, ముద్దులతో ప్రియాంకను ముంచెత్తిన ప్రియుడు.. కిచెన్‌కే అంకితమవుతావా హిత బోధ

బిగ్‌బాస్ హౌస్‌లో గొడవలు, వాగ్వాదాలకు బదులుగా ఈ వారం ఎమోషనల్ టచ్ ఇస్తున్నారు నిర్వాహకులు. కుటుంబ సభ్యులను, మిత్రులను హౌస్‌లోకి పంపుతూ కంటెస్టెంట్స్‌‌ను ఖుషీ చేస్తున్నారు.

Rashmika Mandanna : రష్మికకు తెలుగు ఫిలిం జర్నలిస్ట్‌ల బాసట .. తెలంగాణ డీజీపీకి ఫిర్యాదు

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా పేరుతో వైరల్ అవుతోన్న మార్ఫింగ్ వీడియో ప్రస్తుతం టాక్ ఆఫ్ ది నేషన్‌గా మారింది.