Komatireddy: హరీష్‌రావును సీఎంగా చేస్తాం.. మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు..
Send us your feedback to audioarticles@vaarta.com
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు హాట్‌హాట్‌గా జరుగుతున్న సంగతి తెలిసిందే. కృష్ణా నది ప్రాజెక్టులపై అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య మాటల తూటాలు పేలాయి. ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డి సీఎం పదవికా రాజీనామా చేస్తే.. తాను సీఎం అయి మేడిగడ్డ ప్రాజెక్టును పూర్తి చేసి చూపిస్తానని మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారాయి. తాజాగా హరీష్ వ్యాఖ్యలపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తనదైన శైలిలో స్పందించారు.
అసెంబ్లీలో మీడియాతో చిట్ చాట్‌లో సందర్భంగా హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు కేసీఆర్, కేటీఆర్‌కు వెన్నుపోటు పొడిచేలా ఉన్నాయంటూ ఆయన వ్యాఖ్యానించారు. సీఎం అయ్యే ప్లాన్‌లో హరీష్ రావు ఉన్నట్లున్నారని అభిప్రాయపడ్డారు. అయితే కేసీఆర్‌ను వ్యతిరేకించి వస్తే అందుకు ఫుల్ సపోర్ట్ ఇస్తామంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ కవిత, హరీశ్ రావు, కేటీఆర్ పేర్ల మీద విడిపోతుందని అప్పుడు నాలుగు పార్టీలు అవుతాయని సెటైర్లు వేశారు.
బీఆర్ఎస్‌లో ఉంటే హరీష్ రావు ఎన్నటికీ ముఖ్యమంత్రి కాలేరని.. కనీసం బీఆర్ఎస్‌ఎల్పీ కూడా అవ్వలేరని ఎద్దేవా చేశారు. ఇక కట్టె పట్టుకొని తిరుగుతున్న కేసీఆర్.. పులి ఎలా అవుతారని సెటైర్ వేశారు. 60 కిలోలున్న కేసీఆర్ పులి అయితే.. 86 కిలోలు ఉన్న తాను ఏం కావాలంటూ ప్రశ్నించారు. తెలంగాణలో మరో 20 ఏళ్లు కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉంటుందనే ధీమా వ్యక్తం చేశారు.
అంతకుముందు అసెంబ్లీలో కాళేశ్వరం ప్రాజెక్టుపై చర్చ సమయంలో మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవటంపై వాడివేడి చర్చ జరిగింది. ఈ సమయంలో తమపై విమర్శలు, ఆరోపణలు మానేసి పునరుద్ధరణ పనులు చేపట్టాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. అయితే మేడిగడ్డ బ్యారేజీ మొత్తం కుంగిపోతే పునరుద్ధరణ పనులు చేపట్టమంటున్నారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. దమ్ముంటే మేడిగడ్డను నీళ్లతో నింపి చూపించాలంటూ హరీశ్ రావుకు సవాల్ విసిరారు. ఆ బాధ్యత వారికే ఇస్తానని వ్యాఖ్యానించారు.
రేవంత్ సవాలుపై హరీష్ రావు స్పందించారు. ఆయనకు చేతగాకపోతే రాజీనామా చేయాలని.. తాను సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి మేడిగడ్డ పునరుద్ధరణ పనులు పూర్తి చేసి చూపిస్తానని తెలిపారు. దీంతో హరీష్ సీఎం వ్యాఖ్యలు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. అయితే ఎప్పటికైనా కేసీఆర్‌కు హరీశ్ రావు వెన్నుపోటు పొడుస్తారని కాంగ్రెస్ నేతలు సెటైర్లు వేస్తున్నారు. హరీష్‌కు సీఎం కావాలనే ఆలోచన ఎట్టకేలకు బయటపెట్టారని ఈ సందర్భంగా విమర్శిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments