Komati Reddy: సీఎం రేవంత్ రెడ్డి గురించి మంత్రి కోమటిరెడ్డి పోస్ట్ వైరల్

  • IndiaGlitz, [Monday,January 01 2024]

తెలంగాణ రాష్ట్రం వచ్చిన తొమ్మిదన్నరేళ్ల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆ పార్టీ నేతలు ఫుల్ జోష్‌లో ఉన్నారు. అంతకుముందు ఉప్పు నిప్పులుగా ఉండే నాయకులు ఎన్నికల ప్రచారంలో కలిసి మెలిసి పార్టీని పవర్‌లోకి తీసుకొచ్చారు. అప్పటి నుంచి సీనియర్ నేతలందరూ ఐక్యంగా ఉంటూ ప్రజలకు మెరుగైన పాలన అందించేలా ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. ఈ క్రమంలోనే మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. రెండు రోజులుగా ట్విట్టర్‌లో పెడుతున్న పోస్టులు వైరల్‌గా మారాయి. తాజాగా సీఎం రేవంత్ రెడ్డితో తన స్నేహాన్ని తెలియజేసేలా ఓ వీడియోను పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తోంది.

సలార్ మూవీలోని సూరీడే పాటలోని వేగమొకడు… త్యాగమొకడు.. గతము మరువని గమనమే. ఒకరినొకరు నమ్మి నడిచిన బంధమే ఇదిలే.. ఒకరు గర్జన… ఒకరు ఉప్పెన.. వెరసి ప్రళయాలే. సైగ ఒకరు… సైన్యం ఒకరు. కలిసి కదిలితే కదనమే.. పదాలను ఈ వీడియోకు జత చేశారు. దీంతో రేవంత్, కోమటిరెడ్డి అభిమానులు ఈ వీడియోను షేర్ చేస్తూ ఇలాగే కలిసి ఉండాలని కామెంట్స్ చేస్తున్నారు.

అంతకుముందు డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్కతో కలిసి ఉన్న ఫొటోను కూడా కోమటిరెడ్డి పోస్ట్ చేశారు. దీనికి 'కలిసి కొత్త శకాన్ని నిర్మిద్దాం అని క్యాప్షన్ కూడా ఇచ్చారు. దీంతో తమందరం కలిసి ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తామని విమర్శలకు తనదైన శైలిలో ఆయన స్పష్టం చెప్పారు. అయితే ఈ పోస్టులు చూసిన కాంగ్రెస్ అభిమానుల ఆనందానికి మాత్రం అవధుల్లేకుండా పోయాయి. తమ నాయకులు ఇలాగే ఐక్యంగా ఉండాలని కోరుకుంటున్నారు.

కాగా గతంలో కాంగ్రెస్ పార్టీలో విభేదాలు తీవ్రస్థాయిలో ఉండేవి. ముఖ్యంగా రేవంత్ రెడ్డికి టీపీసీసీ చీఫ్ పదవి ఇచ్చినప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి వంటి సీనియర్ నేతలు తీవ్రంగా ఖండించారు. టీడీపీ నుంచి వచ్చిన ఆయనకు ఎలా అధ్యక్ష పదవి ఇస్తారని విరుచుకుపడ్డారు. కానీ రేవంత్ రెడ్డి తనదైన శైలిలో అందరినీ కలుపుకుని పోయారు. దీంతో గతంలో ఎన్నడూ లేని విధంగా నేతలందరూ కలిసికట్టుగా బీఆర్ఎస్ ప్రభుత్వంపై పోరాటం చేసి పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో సక్సెస్ అయ్యారు. అయితే విపక్ష నేతలు మాత్రం కాంగ్రెస్‌లో సీఎం అభ్యర్థులు ఎక్కువని.. ఆ పార్టీ ఎప్పుడైనా కూలిపోతుందనే విమర్శలు చేస్తున్నారు. అలాంటి వారి విమర్శలకు మంత్రి కోమటిరెడ్డి తన పోస్ట్‌ల ద్వారా చెక్ పెట్టారు.

More News

Devara:ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. 'దేవర' అప్టేడ్ వచ్చేసింది..

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్(NTR) అభిమానులకు న్యూ ఇయర్ ట్రీట్ వచ్చేసింది. పాన్ ఇండియా మూవీ 'దేవర' సినిమా నుంచి అదిరిపోయే అప్టేడ్ వచ్చింది.

ప్రజాపాలనతో పొరుగు రాష్ట్రాలకు ఆదర్శంగా సీఎం జగన్ ప్రభుత్వం

ప్రజలకు కష్టాలు లేకుండా సులభంగా పథకాలు అందించడం ఏ ప్రభుత్వం పని తీరునైనా తెలియజేస్తుంది. ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్తే చాలు ఆ రాష్ట్రంలో ప్రభుత్వం ఏ విధంగా

Former DSP Nalini:సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన మాజీ డీఎస్పీ నళిని.. ఏమన్నారంటే..?

తెలంగాణ మాజీ డీఎస్పీ నళిని(Former DSP Nalini) సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)ని మర్యాదపూర్వకంగా కలిశారు.

Guntur Kaaram:'కుర్చీ మడతపెట్టి..'ఫుల్ సాంగ్ వచ్చేసిందిగా.. ఫ్యాన్స్‌కు పూనకాలే..

సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్‌ను ఉర్రుతలూగించే సాంగ్ వచ్చేసింది. న్యూ ఇయర్ కానుకగా 'కుర్చీ మడతపెట్టి..' పుల్ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు.

Modi:అమృత భారత్ రైళ్లు ప్రారంభించిన ప్రధాని మోదీ

అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవం ముందుగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని మోదీ(PM Modi) శ్రీకారం చుట్టారు.