Komati Reddy: సీఎం రేవంత్ రెడ్డి గురించి మంత్రి కోమటిరెడ్డి పోస్ట్ వైరల్
Send us your feedback to audioarticles@vaarta.com
తెలంగాణ రాష్ట్రం వచ్చిన తొమ్మిదన్నరేళ్ల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆ పార్టీ నేతలు ఫుల్ జోష్‌లో ఉన్నారు. అంతకుముందు ఉప్పు నిప్పులుగా ఉండే నాయకులు ఎన్నికల ప్రచారంలో కలిసి మెలిసి పార్టీని పవర్లోకి తీసుకొచ్చారు. అప్పటి నుంచి సీనియర్ నేతలందరూ ఐక్యంగా ఉంటూ ప్రజలకు మెరుగైన పాలన అందించేలా ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. ఈ క్రమంలోనే మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. రెండు రోజులుగా ట్విట్టర్లో పెడుతున్న పోస్టులు వైరల్‌గా మారాయి. తాజాగా సీఎం రేవంత్ రెడ్డితో తన స్నేహాన్ని తెలియజేసేలా ఓ వీడియోను పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది.
సలార్ మూవీలోని సూరీడే పాటలోని "వేగమొకడు… త్యాగమొకడు.. గతము మరువని గమనమే. ఒకరినొకరు నమ్మి నడిచిన బంధమే ఇదిలే.. ఒకరు గర్జన… ఒకరు ఉప్పెన.. వెరసి ప్రళయాలే. సైగ ఒకరు… సైన్యం ఒకరు. కలిసి కదిలితే కదనమే.." పదాలను ఈ వీడియోకు జత చేశారు. దీంతో రేవంత్, కోమటిరెడ్డి అభిమానులు ఈ వీడియోను షేర్ చేస్తూ ఇలాగే కలిసి ఉండాలని కామెంట్స్ చేస్తున్నారు.
అంతకుముందు డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్కతో కలిసి ఉన్న ఫొటోను కూడా కోమటిరెడ్డి పోస్ట్ చేశారు. దీనికి 'కలిసి కొత్త శకాన్ని నిర్మిద్దాం" అని క్యాప్షన్ కూడా ఇచ్చారు. దీంతో తమందరం కలిసి ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తామని విమర్శలకు తనదైన శైలిలో ఆయన స్పష్టం చెప్పారు. అయితే ఈ పోస్టులు చూసిన కాంగ్రెస్ అభిమానుల ఆనందానికి మాత్రం అవధుల్లేకుండా పోయాయి. తమ నాయకులు ఇలాగే ఐక్యంగా ఉండాలని కోరుకుంటున్నారు.
కాగా గతంలో కాంగ్రెస్ పార్టీలో విభేదాలు తీవ్రస్థాయిలో ఉండేవి. ముఖ్యంగా రేవంత్ రెడ్డికి టీపీసీసీ చీఫ్ పదవి ఇచ్చినప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి వంటి సీనియర్ నేతలు తీవ్రంగా ఖండించారు. టీడీపీ నుంచి వచ్చిన ఆయనకు ఎలా అధ్యక్ష పదవి ఇస్తారని విరుచుకుపడ్డారు. కానీ రేవంత్ రెడ్డి తనదైన శైలిలో అందరినీ కలుపుకుని పోయారు. దీంతో గతంలో ఎన్నడూ లేని విధంగా నేతలందరూ కలిసికట్టుగా బీఆర్ఎస్ ప్రభుత్వంపై పోరాటం చేసి పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో సక్సెస్ అయ్యారు. అయితే విపక్ష నేతలు మాత్రం కాంగ్రెస్‌లో సీఎం అభ్యర్థులు ఎక్కువని.. ఆ పార్టీ ఎప్పుడైనా కూలిపోతుందనే విమర్శలు చేస్తున్నారు. అలాంటి వారి విమర్శలకు మంత్రి కోమటిరెడ్డి తన పోస్ట్‌ల ద్వారా చెక్ పెట్టారు.
వేగమొకడు… త్యాగమొకడు
— Komatireddy Venkat Reddy (@KomatireddyKVR) December 31, 2023
గతము మరువని గమనమే.
ఒకరినొకరు నమ్మి నడిచిన బంధమే ఇదిలే
ఒకరు గర్జన… ఒకరు ఉప్పెన
వెరసి ప్రళయాలే.
సైగ ఒకరు… సైన్యం ఒకరు
కలిసి కదిలితే కదనమే...#AdminPost #KomatiReddyVenkatReddy #RevanthReddy #TelanganaPrajaPrabhutwam @revanth_anumula @INCTelangana pic.twitter.com/BPNdM4LuRZ
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout