పేకాట ఆడితే ఉరిశిక్ష వేసేస్తారా..? : కొడాలి నాని

  • IndiaGlitz, [Monday,January 04 2021]

ఆంధ్రప్రదేశ్ కీలక మంత్రి కొడాలి నాని అనుచరులు పేకాట స్థావరాలు నిర్వహిస్తున్నట్లు ఎస్ఈబీ దాడులు నిర్వహించి భారీగా వాహనాలు, నగదు సీజ్ చేసిన విషయం విదితమే. ఈ ఘటన గత 24 గంటలుగా ఏపీ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. కొన్ని ప్రధాన పత్రికలు, చానెల్స్ ఇందుకు సంబంధించిన వార్తలను ప్రసారం చేయడంతో దీనికి మరింత హైప్ వచ్చినట్లయ్యింది. అంతేకాకుండా ఇవాళ హడావుడిగా సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలవడానికి ఆయన నివాసానికి కొడాలి నాని వెళ్లడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. జగన్‌తో భేటీ అనంతరం ఈ వ్యవహారంపై మీడియాతో మాట్లాడిన నాని అగ్గికి ఆజ్యం పోసినట్లుగా మరింత రెచ్చగొట్టే రీతిలో మాట్లాడటం మీడియా ప్రతినిధులు, టీవీలు చూసిన జనాలు సైతం విస్తుపోయారు. ఇంతకీ నానీ ఏమన్నారు..? ఎందుకు ఇలా అనాల్సి వచ్చిందనే విషయం ఈ కథనంలో చూద్దాం. మొదట మాజీ మంత్రులు దేవినేని ఉమా మహేశ్వరరావు, నారా లోకేష్ గురించి మాట్లాడిన మంత్రి తీవ్ర విమర్శలు గుప్పించారు. అంతటితో ఆగని ఆయన టీడీపీ అధినేత చంద్రబాబుపై కూడా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

మేం చేయమంటేనే దాడులు చేశారు!

‘గుడివాడలో పేకాట క్లబ్బులపై మా పోలీసులే దాడి చేశారు. నేను పేకాట శిబిరాలు నడిపితే మా పోలీసులు ఎందుకు పట్టుకుంటారు..?. కొనకళ్ల నారాయణ ఇంట్లో పేకాట క్లబ్బులు నిర్వహించేవారు. విజయవాడ, గుంటూరులో క్లబ్బులు నడిపేవారు. మొత్తం 1200 మంది బ్రోకర్లు ఉండేవారు. వచ్చే డబ్బులు లోకేష్‌కు ఇచ్చేవాడు. మేం చేయమంటేనే గుడివాడలో రైడ్‌లు జరిగాయి. నా అనుచరులు పేకాటలో ఉంటే ఏమవుతుంది..?. పేకాట ఆడినంత మాత్రాన ఉరిశిక్ష వేస్తారా..? అరెస్ట్ చేస్తారు.. ఆ తర్వాత కోర్టుకెళ్లి పెనాల్టీ కడతారు.. బయటికి వచ్చి మళ్లీ ఆడతారు. అందుకే ఇలాంటివన్నీ జరగకుండా ఉండేందుకు చట్టాల్లోనే మార్పులు తీసుకువస్తున్నాం. కొంతమందిని టీడీపీ అధినేత చంద్రబాబు రోడ్లపైకి వదిలేశారు. చంద్రబాబు అడుగుజాడల్లోనే ఈ కుట్రలన్నీ జరుగుతున్నాయి’ అని మంత్రి నాని చెప్పుకొచ్చారు.

జగన్‌ను కలవడం వెనుక..

‘నేను ఇవాళ సీఎం జగన్‌ గారిని కలిసిన మాట వాస్తవమే. అయితే వ్యక్తిగత పనుల కోసం కాదు. సీఎం ఇప్పటి వరకూ వ్యక్తిగత పనుల కోసం అభ్యర్థించలేదు. నేనేంటో గుడివాడ ప్రజలకు తెలుసు. ఇలాంటి పనులకు నేను ముఖ్యమంత్రి దగ్గరకి పరిగెత్తుకు వెళ్లాలా?.. నాకు అంత అవసరం లేదు. ఇవాళ నేను గుడివాడలో రోడ్డు పనుల కోసం మాత్రమే సీఎంను కలిశాను. అది ప్రజల కోసమే. గుడివాడ ప్రజలు నన్ను నాలుగు సార్లు గెలిపించారు. వారి పనుల కోసమే వెళ్లాను.. వెళతాను కూడా. ప్రతి రోజూ పేకాట ఆడేవారిని నాలుగైదు చోట్ల పోలీసులు పట్టుకుంటారు.. అలా ఎక్కడో ఓ చోట పట్టుకుంటూనే ఉంటారు. అంతేకాకుండా జనరల్‌గా తనిఖీలు కూడా జరుగుతుంటాయి. నిన్న జరిగిన ఘటనతో నా మీద కొందరు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. పలానా చోట పేకాట ఆడుతున్నారని నాకు సమాచారం ఇవ్వండి. 24 గంటల్లో రైడ్ చేయిస్తాను’ అంటూ మీడియా మీట్ నుంచి మంత్రి తిన్నగా వెళ్లిపోయారు. కాగా.. మంత్రిగారు ఏదన్నా చాలా తేలిగ్గా మాట్లాడేస్తారన్న విషయం అందరికీ తెలుసు. కొద్ది రోజుల క్రితం ఆంజనేయస్వామి విగ్రహం ధ్వంసమయితే దీనిపై మంత్రి స్పందిస్తూ.. విరిగింది బొమ్మ చెయ్యే కదా.. ? అని లైట్ తీసుకున్నారు. ఇలా ప్రతిసారి మంత్రిగారు తప్పించుకునేలా మాట్లాడటం ఎంతవరకు సబబో మరి.

More News

మ‌రో బిగ్‌బాస్ కంటెస్టెంట్‌కు మెగా అవ‌కాశం

మెగాస్టార్ చిరంజీవి రెండు బిగ్‌బాస్ ఫైన‌ల్స్‌కు ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. బిగ్‌బాస్ సీజ‌న్ 3, సీజ‌న్ 4 కంటెస్టెంట్స్‌ను పోల్చి చూస్తే..

టాలీవుడ్‌పై అన‌సూయ సెన్సేష‌న‌ల్ కామెంట్స్‌... !

టాలీవుడ్ బుల్లితెర‌పై హాట్ యాంక‌ర్ ఇమేజ్‌తో అద‌ర‌గొడుతున్న అతి కొద్ది మందిలో అన‌సూయ భ‌ర‌ద్వాజ్ ఉండ‌నే ఉంటుంది.

ఏపీ పాలిటిక్స్‌లో వేలుపెట్టిన బండి.. సంచలన కామెంట్స్

తెలంగాణలో దుబ్బాక ఉపఎన్నిక, గ్రేటర్ ఎన్నికల్లో సత్తా చాటిన బీజేపీ మంచి ఊపు మీద ఉంది.

డ్రగ్స్ కేసు : ముంబైలో దొరికిన తెలుగు హీరోయిన్ ఎవరంటే..!

మాదక ద్రవ్యాల కేసు.. టాలీవుడ్‌ను ఓ కుదుపు కుదిపేసి.. తరువాత బాలీవుడ్‌లోనూ ప్రకంపనలు సృష్టించి చివరకు తిరిగి టాలీవుడ్‌ మెడకూ చుట్టుకుంటోంది.

ఐయామ్‌ బ్యాక్‌..రకుల్‌ ఆన్‌ సెట్స్‌ సందడి

తెలుగు, తమిళ, హిందీ చిత్రాల్లో నటించి హీరోయిన్‌గా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది రకుల్‌ ప్రీత్‌ సింగ్‌.