YS Jagan:57.3 లక్షల ధ్రువపత్రాలు, 1.17 లక్షల కుటుంబాల్లో సర్వే .. జగనన్న సురక్ష సూపర్ సక్సెస్

  • IndiaGlitz, [Friday,July 21 2023]

వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘జగనన్న సురక్ష’ కార్యక్రమం విజయవంతంగా సాగుతోందన్నారు నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షులు, వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధణ్‌ రెడ్డి. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలకు అవసరమైన సేవలు అందించే ఇలాంటి కార్యక్రమాలతో వైసీపీ ప్రభుత్వం గొప్ప చరిత్ర సృష్టించిందన్నారు. అర్హత ఉన్న ఏ ఒక్కరూ సంక్షేమ పథకాలు అందకుండా ఉండరాదన్న లక్ష్యంతో జగనన్న సురక్షకు శ్రీకారం చుట్టామని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమం జగనన్న ప్రభుత్వ నిబద్ధతకు ఉదాహరణగా నిలిచిందని తెలిపారు.

ఒక్క నెల్లూరు జిల్లాలోనే 552 జగనన్న సురక్ష క్యాంపులు పూర్తి :

జూలై 1 నుంచి ప్రారంభమైన జగనన్న సురక్ష 15,004 సచివాలయాలకు గాను ఇప్పటివరకు 10,700 సచివాలయాల పరిధిలో శిబిరాలు నిర్వహించిందని మంత్రి కాకాణి వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న సురక్ష కోసం మొత్తం 1.17 కోట్ల కుటుంబాల్లో సర్వే చేశామని పేర్కొన్నారు. అందులో 57.3 లక్షల మందికి ధ్రువ పత్రాలు అందించి వారికి నేరుగా ప్రయోజనం చేకూర్చామని గోవర్ధన్ రెడ్డి చెప్పారు.
ఇప్పటి వరకు ఈ శిబిరాల ద్వారా 27,32,866 ఇంటిగ్రేటెడ్ సర్టిఫికెట్లు.. 24,46,599 ఆదాయ ధృవీకరణ పత్రాలు.. 3,159 ఓబీసీ సర్టిఫికెట్లు.. 5,199 ఫ్యామిలీ సర్టిఫికెట్లు జారీ అయ్యాయని మంత్రి తెలిపారు.

ఈ విజయం ప్రతీ వాలంటీర్‌ది: మంత్రి కాకాణి

అలాగే నెల్లూరు జిల్లాలో జగనన్న సురక్ష కార్యక్రమం వివరాలు కూడా మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి వెల్లడించారు. జిల్లాలో నేటికి మొత్తం 552 క్యాంపులను నిర్వహించినట్లు ఆయన చెప్పారు. జిల్లావ్యాప్తంగా మొత్తం 6,30,873 ఇళ్లలో సర్వే చేశారని గోవర్ధన్ రెడ్డి తెలిపారు. ఇందులో సేవల కోసం మొత్తం 3,92,199 అభ్యర్థనలు నమోదు కాగా.. వాటిలో 3,84,481 అభ్యర్థనలు ఆమోదించామన్నారు. అంతేకాకుండా ఈ నెల జూలై 18న ఒకే రోజులో 6,87,863 సర్టిఫికెట్లు జారీ చేసి రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త రికార్డు సృష్టించిందని మంత్రి హర్షం వ్యక్తం చేశారు. గతంలో ఏ ప్రభుత్వమూ ప్రయత్నించని, సాధించని ఘనతను జగన్ ప్రభుత్వం సాధిచిందని పేర్కొన్నారు. ఈ భారీ విజయాన్ని సాధించిన ఘనత ప్రతి గ్రామ వాలంటీర్‌కు కూడా చెందుతుందని కాకాణి చెప్పారు. ప్రజల్లో అవగాహనను పెంపొందించేందుకు వాలంటీర్లు అవిశ్రాంతంగా పనిచేస్తున్నారని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ప్రశంసించారు.

More News

Globalstar Ram Charan:పాప పుట్టిన క్షణం ఒత్తిడి మరిచిపోయాం : క్లీంకార ఆగమనంపై చరణ్ వీడియో, చెంచుల బిడ్డగా పెంచుతామన్న చెర్రీ

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ - ఉపాసన దంపతులు పేరెంట్స్ క్లబ్‌లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే.

Sabitha Indra Reddy:తెలంగాణకు స్కూళ్లకు రెండ్రోజులు సెలవులు..  ఇప్పుడే లేచారా, సబితమ్మను ఏకీపారేస్తున్న నెటిజన్లు

తెలంగాణలో గడిచిన రెండు రోజులుగా వర్షాలు దంచి కొడుతున్నాయి. దీంతో వాగులు, వంకలు పోటెత్తుతున్నాయి.

Prabhas:డార్లింగ్ ఫ్యాన్స్ ఎదురుచూపులకు ఫుల్‌స్టాప్ : ప్రాజెక్ట్ కే గ్లింప్స్ వచ్చేసింది.. టైటిల్ కూడా..!!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ - నాగ్ అశ్విన్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘‘ప్రాజెక్ట్ కే’’. భారీ బడ్జెట్‌తో పాటు ఇండియాలోని పలు చిత్ర పరిశ్రమలకు చెందినవారితో

Pawan Kalyan:వాలంటీర్లపై వ్యాఖ్యలు.. చిక్కుల్లో పవన్ కళ్యాణ్, కోర్టుకెక్కనున్న జగన్ ప్రభుత్వం

జనసేన అధినేత పవన్ కల్యాణ్ చిక్కుల్లో పడ్డారు. వాలంటీర్లపై ఆయన చేసిన వ్యాఖ్యలను ఏపీ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది.

Margadarshi:మార్గదర్శి మేనేజర్‌ను తీసుకెళ్లిన దర్యాప్తు బృందం .. దొరకని ఆచూకీ, సిబ్బందిలో ఆందోళన

విజయవాడ లబ్బీపేట మార్గదర్శి బ్రాంచి మేనేజర్ బి. శ్రీనివాసరావును గురువారం దర్యాప్తు బృందాలు అదుపులోకి తీసుకున్నాయి.