థియేటర్ల ఓపెనింగ్స్‌పై కేంద్ర మంత్రి కిషన్ క్లారిటీ..
Send us your feedback to audioarticles@vaarta.com
కరోనా నేపథ్యంలో కేంద్రం విధించిన లాక్‌డౌన్‌తో సినిమా షూటింగ్స్, రిలీజ్లు, థియేటర్లు మూసివేసిన విషయం విదితమే. ఇప్పటికే చాలా రోజులు కావడంతో సినిమానే నమ్ముకున్న లక్షలాది మంది కార్మికులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. మరోవైపు భారీ ప్రాజెక్టులు సైతం ఆగిపోయాయి. ఈ క్రమంలో సినిమా షూటింగ్స్‌కు పర్మిషన్ ఇవ్వాలని ఇటీవలే తెలంగాణ సీఎం కేసీఆర్‌ను టాలీవుడ్ సినీ పెద్దలు కోరిన విషయం తెలిసిందే. పోస్ట్ ప్రొడక్షన్స్ పనులకు ఓకే.. జూన్-01 నుంచి షూటింగ్స్ చేసుకోవచ్చని అయితే ప్రభుత్వం ఇచ్చే గైడ్ లైన్స్ తప్పక పాటించాలని కేసీఆర్ స్పష్టం చేశారు. అయితే థియేటర్ల ఓపెనింగ్స్‌కు ఇంకా టైమ్ పడుతుందని.. కచ్చితంగా టాలీవుడ్‌ను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు.
షూటింగ్స్‌కు ఓకే కానీ..
అయితే.. సినిమా షూటింగ్స్, రిలీజ్లు, థియేటర్ల ఓపెనింగ్స్‌పై తాజాగా కేంద్ర హోం సహాయక మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సినిమా షూటింగ్స్ జరుపుకోవడానికి త్వరలోనే అనుమతిస్తామన్నారు. అయితే.. థియేటర్లు మాత్రం ఏపీలో ఒకసారి.. తెలంగాణలో ఒకసారి ఇతర రాష్ట్రాల్లో ఇలా ఏమీ ఉండదని దేశవ్యాప్తంగా ఒకేసారి థియేటర్లు ఓపెన్ చేయడానికి నిర్ణయం తీసుకుంటామన్నారు. టాలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన.. పలు విషయాలపై నిశితంగా చర్చించారు. ఈ కాన్ఫరెన్స్‌లో డి.సురేశ్‌బాబు, దర్శకుడు తేజ, జెమినీ కిరణ్, దామోదర ప్రసాద్, వివేక్ కూచిభొట్ల, త్రిపురనేని వరప్రసాద్, అనిల్ శుక్లా అభిషేక్ అగర్వాల్, శరత్ మరార్, ప్రశాంత్, యర్నేని రవితో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
జీఎస్టీపై హామీ!
షూటింగ్స్‌కు అనుమతి, సినిమా రిలీజ్లు, తో పాటు క్యాప్టివ్ పవర్, పైరసీ, ఓటీటీలో సినిమా విడుదల, ప్రాంతీయ భాషా చిత్రాలపై జీఎస్టీ, టీడీఎస్, సినిమా కార్మికుల ప్రత్యేక ప్యాకేజిపై కేంద్ర మంత్రికి పెద్దలు నిశితంగా వివరించారు. ఇందుకు ఆయన స్పందిస్తూ.. ప్రాంతీయ భాషా చిత్రాల నిర్మాణం మరింత పెరిగేలా రీజినల్ జీఎస్టీ గురించి ఆలోచన చేస్తామని హామీ ఇచ్చారు. మరీ ముఖ్యంగా.. కశ్మీరు సహా దేశంలో ఎక్కడైనా షూటింగులు, స్టూడియోల నిర్మాణం కోసం ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడతానన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments