‘2.0 పూర్తయ్యేనాటికి నా రాజకీయ జీవితం ముగుస్తుంది’
Send us your feedback to audioarticles@vaarta.com
బీజేపీ నేతలు, కేంద్ర మంత్రుల పరిస్థితి 2019 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చాక ‘ఎవరికి వారే యమునా తీరే’ అన్నట్లుగా ఉంది. ఎవరు మీడియా ముందుకు ఏం మాట్లాడుతారో..? అసలు ఏం మాట్లాడాలని మీడియా ముందుకొస్తారో తెలియని పరిస్థితి. ఇలా అనుకున్నదొక్కటి.. అయినదొక్కటి అనే చందంగా.. ఏదో చెప్పబోయి.. అసలు విషయం మరిచిపోయి ఇంకేదో చెప్పి కమలనాథులు వార్తల్లో నిలిచిన సందర్భాలు కోకొల్లలు. ఇలాంటి వారిలో కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ ఒకరు. ఇప్పటికే పలుమార్లు మీడియా ముందుకు వచ్చిన ఈయన.. వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయితే తాజాగా తన రాజకీయ జీవితం మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
నా కల పరిపూర్ణమైంది!
‘నరేంద్ర మోదీ ప్రభుత్వం రెండోసారి చేపట్టిన ఐదేళ్ల పాలన పూర్తయ్యే నాటికి 2024లో నేను రాజకీయాల్లోంచి తప్పుకునే అవకాశం ఉంది. మోదీ 2.0 ప్రభుత్వం పూర్తయ్యేనాటికి నా రాజకీయ జీవితం ముగుస్తుందని అనుకుంటున్నాను. నేను పదవుల కోసం రాజకీయాల్లో రాలేదు. కశ్మీర్‌ను భారత్‌లో పూర్తిగా విలీనం చేయాలనే కలతోనే ఈ రంగంలో అడుగుపెట్టాను. ప్రధాని నరేంద్ర మోదీ చొరవతో నా కల పరిపూర్ణమైంది. ఇక రాజకీయాలకు స్వస్తి చెప్పే సమయం ఆసన్నమైంది. నరేంద్ర మోదీ లాంటి ప్రధాని ఉండటం నిజంగా మన అదృష్టం. కశ్మీర్ విషయంలో ఆయన నా వాగ్దానాన్ని నెరవేర్చారు. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోదీ పదవీ కాలం పూర్తి చేసుకునే లోపు అంటే 2024 నాటికి నా రాజకీయ జీవితం ముగిసే అవకాశం ఉంది. మా పార్టీ సిద్ధాంతకర్త శ్యామ ప్రసాద్ ముఖర్జీ దేనికోసమే ప్రాణ త్యాగం చేశారో.. ఆర్టికల్ 370 రద్దుతో దానికి ప్రతిఫలం దక్కింది’ అని గిరిరాజ్ చెప్పుకొచ్చారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments