Botsa Satyanarayana:చూచిరాతలు, స్కాంలు.. ఆఫ్ట్రాల్ పరీక్షలే నిర్వహించలేరు .. తెలంగాణతో ఏపీకి పోలికా : బొత్స సంచలన వ్యాఖ్యలు
Send us your feedback to audioarticles@vaarta.com
టీఎస్పీఎస్సీ పేపర్ లీక్, మాస్ కాపీయింగ్ తదితర ఘటనల నేపథ్యంలో తెలంగాణ విద్యావ్యవస్థపై మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆఫ్ట్రాల్ సర్వీస్ కమీషన్ పరీక్షలనే నిర్వహించుకోలేని పరిస్థితి తెలంగాణలో వుందన్నారు. టీఎస్పీఎస్సీ పరీక్షల్లో ఎన్ని స్కాంలు జరిగాయో చూశామని.. అన్ని చూచిరాతలేనని, డైలీ ఎంతమంది అరెస్ట్ అవుతున్నారో వార్తలు వస్తున్నాయని బొత్స సత్యనారాయన చురకలంటించారు. చివరికి టీచర్లను కూడా బదిలీ చేసుకోలేకపోతున్నారని మంత్రి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏ రాష్ట్ర విధానం , ఆ రాష్ట్రానిదని.. అందుకే ఒక రాష్ట్రాన్ని మరో రాష్ట్రంతో పోల్చకూడదని బొత్స సూచించారు. బొత్స వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి దీనిపై తెలంగాణ మంత్రులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. గతంలోనూ ఏపీ, తెలంగాణ మంత్రుల మధ్య మాటల యుద్ధం నడిచిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్‌లో రోడ్లు, విద్యుత్ వంటి అంశాలను ప్రస్తావిస్తూ తెలంగాణ మంత్రులు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా హరీశ్ రావు.. పలుమార్లు ఏపీతో తెలంగాణను పోలుస్తూ హాట్ కామెంట్స్ చేసేవారు. దీనికి ఏపీ నుంచి కూడా ధీటుగా కౌంటర్ వచ్చేది.
టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో మరో ఇద్దరు అరెస్ట్ :
మరోవైపు.. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో బుధవారం మరో రెండు అరెస్ట్‌లు చోటు చేసుకున్నాయి. కరీంనగర్‌కు చెందిన శ్రీనివాస్ అతని కుమార్తె సాహితిని సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కూతురి కోసం శ్రీనివాస్ ఏఈఈ పేపర్ కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది. దీంతో వారిద్దరిని సిట్ అదుపులోకి తీసుకుంది. వీరితో కలిపి పేపర్ లీక్ కేసులో మొత్తం అరెస్ట్‌ల సంఖ్య 80కి చేరింది. రానున్న రోజుల్లో వీటి సంఖ్య మరింత పెరిగే అవకాశం వుంది. ఇటీవల అరెస్ట్ అయిన ఏఈ పేపర్ 16వ ర్యాంకర్ ఇచ్చిన సమాచారంతో తాజా అరెస్ట్‌లు జరిగినట్లు తెలుస్తోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com