బాబు, లోకేష్, పవన్‌లకు మంత్రి అవంతి ఓపెన్ చాలెంజ్
Send us your feedback to audioarticles@vaarta.com
టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేష్, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లకు పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ ఓపెన్ చాలెంజ్ చేశారు. విశాఖ జిల్లాలో వైయస్ఆర్ సీపీ నాయకులు ఇసుక దోచుకున్నారని ఆరోపణలు చేస్తున్నారని, నిరూపిస్తే వారిని సస్పెండ్ చేయిస్తా.. చేయలేకపోతే తాను మంత్రి పదవికి రాజీనామా చేస్తానన్నారు. ఒకవేళ నిరూపించలేకపోతే.. చంద్రబాబు, పవన్ రాజకీయాల నుంచి తప్పుకోవాలని సూచించారు. విశాఖలోని గ్రీన్ పార్కు హోటల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఇసుక పోరాటం అని చంద్రబాబు, పవన్ ఏదేదో మాట్లాడుతున్నారని, వారి మాటలు వింటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందన్నారు. గత ఐదేళ్లు భీమిలి నియోజకవర్గంలో ఎన్ని లక్షల టన్నుల ఇసుక తొవ్వారో ఆధారాలతో సహా నిరూపిస్తానన్నారు.
చంద్రబాబుకు నిద్రపట్టడం లేదు!
‘వైఎస్ కుటుంబానిది అన్నం పెట్టే చెయ్యి. ప్రజాధనం కాపాడాలని సీఎం జగన్ చేస్తున్న ప్రయత్నం చంద్రబాబు నచ్చడం లేదు. అందుకే ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారు. పది సంవత్సరాల్లో ఎన్నడూ లేనంతగా ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలు తీసుకోగానే.. వరుణదేవుడు కరుణించాడని, కృష్ణానదికి ఏడు సార్లు, గోదావరికి ఐదు సార్లు వరదలు వచ్చాయి. ఐదు సంవత్సరాల్లో అమలు చేయాల్సిన మేనిఫెస్టోలోని అంశాలను ఐదు నెలల్లో జగన్ అమలు చేస్తుంటే చంద్రబాబుకు నిద్రపట్టడం లేదు. అందుకే సీఎం జగన్‌పై చంద్రబాబు, ఆయన తాబేదారులు వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు. ప్రభుత్వంపై, సీఎంపై తప్పుడు ప్రచారాలు చేస్తే ఊరుకునేది లేదు’ అని మంత్రి అవంతి శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. చంద్రబాబు వయస్సు తగ్గ మాటలు మాట్లాడాలని ఒకింత మంత్రి హెచ్చరించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout