Ambati Rambabu son-in-law:మరో వీడియో వదిలిన మంత్రి అంబటి రాంబాబు అల్లుడు

  • IndiaGlitz, [Tuesday,May 07 2024]

ఏపీ మంత్రి అంబటి రాంబాబు(Ambati Rambabu), ఆయన చిన్నల్లుడు గౌతమ్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. మా మావయ్య అంబటి రాంబాబు దుర్మార్గుడు అంటూ ఆయన అల్లుడు ఇటీవల ఓ వీడియో విడుదల చేయగా.. ఆ ఆరోపణలను అంబటి ఖండించిన సంగతి తెలిసిందే. తన అల్లుడు వెనక టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ ఉన్నారని ఆరోపించారు. దీంతో అంబటి రాంబాబు వ్యాఖ్యలపై గౌతమ్ మరో వీడియో వదిలారు.

ఇటీవల నేను పెట్టిన వీడియో వైరల్ అయ్యింది. చాలా మంది ప్రశ్నలు అడుగుతున్నారు. అంబటి రాంబాబు గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. మా మామయ్య ఇంత మంచోడా అని నేనేన నమ్మేశా. ఆ ప్రెస్ మీట్లో నాలుగేళ్ల నుంచి తన మనవడు, మనవరాలు తన దగ్గరే ఉంటున్నారని.. వారి ఆర్థిక అవసరాలు జాగ్రత్తగా చూసుకుంటున్నానని చెప్పారు. అల్లుడైన నేను ఎలాంటి ఆర్థిక సాయం లేదని.. దుర్మార్గున్ని అయితే గీతే నేనేనంటూ మా మామయ్య అంబటి రాంబాబు మాట్లాడారు. నా వెనుక మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఉన్నానని ఆరోపించారు అని తెలిపారు .

ఈ వీడియో నేను 2023 మార్చి 3న పంపించిన వీడియో ఇది. ఆయనకు మాట కూడా రావడం లేదు. అయినా కూడా మనవణ్ని, మనవరాలిని చూడాలని నా తండ్రి ఐసీయూ నుంచి కోరుకున్నారు. మార్చి 22 నా తండ్రి చనిపోయాడు. తన మనవణ్ని, మనవరాలిని చూసుకోలేదని ఆయన ఎంత కృంగిపోయి ఉంటాడో మీకు తెలుసా. మీ కుటుంబాన్ని ప్రశ్నిస్తే ఎంత దుర్మార్గమైనా చేస్తారా. ఒక తండ్రి ఆఖరి కోరిక తీర్చలేని కొడుకుగా మిగిలిపోయా. మీరేదో న్యాయం చేస్తారని నమ్మి నాలుగేళ్లు ఎదురుచూసి.. చివరకు విసిగెత్తి కోర్టుకు వెళ్లా అని గౌతమ్ ఆవేదన వ్యక్తం చేశారు.

నా తండ్రి ఆఖరి క్షణాలలో తన మనవడ్ని, మనవరాలని చూసుకోవాలని పంపించాలని నేను ప్రాధేయపడితే పంపలేదు. ఇప్పటికీ చెప్తున్నా.. నా కొడుకును, కూతురుని మీరు పోషించాల్సిన పనిలేదు. మీరు రూపాయి పెట్టాల్సిన పనిలేదు. మీడియా సాక్షిగా నా పిల్లలను మా ఇంటి దగ్గర వదిలిపెట్టండి. నేను పోషించుకుంటా. కనీసం మీకు ఆత్మసాక్షి ఉందా. ప్రజలారా ఇలాంటి నాయకులు గురించి ఇక మీరే ఆలోచించుకోండి. అంటూ అందులో పేర్కొన్నారు.

More News

Committee Kurrollu:జయప్రకాష్ నారాయణ చేతుల మీదుగా  ‘కమిటీ కుర్రోళ్ళు’ నుంచి ‘గొర్రెలా..’ అనే పాట విడుదల

ఎన్నికల సమయం దగ్గర పడుతుంది.. రాజకీయ పార్టీలు ప్రజలను ప్రలోభ పెట్టటానికి ఎన్ని మార్గాలున్నాయో అన్నింటినీ అన్వేషిస్తున్నాయి.

Prime Minister Modi:హైదరాబాద్ రానున్న ప్రధాని మోదీ.. సిటీలో ట్రాఫిక్ ఆంక్షలు..

తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరుకుంది. పోలింగ్‌కు కేవలం ఆరు రోజులు మాత్రమే సమయం ఉండటంతో అధికార,

Chiranjeevi:పవన్ కల్యాణ్‌ను గెలిపించండి.. ప్రజలకు మెగాస్టార్ చిరంజీవి సందేశం..

పోలింగ్‌కు ఐదు రోజులు ముందు ఏపీ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. పిఠాపురంలో

Chandrababu:పేదలపై మరోసారి చంద్రబాబు కుట్రలు.. పథకాలు అందకుండా ఈసీకి ఫిర్యాదు..

టీడీపీ అధినేత చంద్రబాబుకు పేదలంటే ఎందుకింత చులకనే అర్థం కావడం లేదు. తొలి నుంచి పేదలంటే ఆసహ్యించుకునే చంద్రబాబు ఎన్నికల

Modi:ఎన్డీఏ అభివృద్ధి వైపు.. వైసీపీ అవినీతి వైపు.. ప్రధాని మోదీ విమర్శలు

వైసీపీ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని ప్రధాని మోదీ విమర్శించారు. అనకాపల్లి జిల్లా రాజుపాలెంలో ఏర్పాటు చేసిన ప్రజాగళం సభకు