Minister Ambati Rambabu:తగ్గేదే లేదు 'బ్రో' .. కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేయనున్న అంబటి.. ఢిల్లీకి పయనం
Send us your feedback to audioarticles@vaarta.com
సముద్రఖని దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కల్యాణ్, సాయిథరమ్ తేజ్ హీరోలుగా నటించిన చిత్రం ‘బ్రో’. గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా తెలుగు సినీ, రాజకీయ రంగాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ సినిమాలోని శ్యాంబాబు క్యారెక్టర్ ఏపీ మంత్రి అంబటి రాంబాబును పోలి వున్నట్లుగా ట్రోలింగ్ జరుగుతోంది. దీనిని మంత్రి అంబటి సీరియస్‌గా తీసుకున్నారు. ఇప్పటికే దీనిపై వార్నింగ్ ఇచ్చిన ఆయన.. పవన్‌పై బయోపిక్ తీస్తానని చెప్పి పరిశీలనలో వున్న టైటిల్స్‌ను కూడా వివరించారు. అయితే అంతటితో ఈ విషయాన్ని అంబటి రాంబాబు వదిలేలా కనిపించడం లేదు. దీనిపై ఢిల్లీ స్థాయిలోనే తేల్చుకోవాలని ఆయన భావిస్తున్నారు. బ్రో సినిమా వెనుక జరిగిన లావాదేవీలపై కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేయాలని అంబటి రాంబాబు యోచిస్తున్నారు. దీనిలో భాగంగా బుధవారం ఆయన ఢిల్లీకి చేరుకుంటారని వైసీపీ వర్గాల టాక్. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల కోసం ఢిల్లీలో వున్న వైసీపీ ఎంపీల సాయంతో దర్యాప్తు సంస్థలకు అంబటి ఫిర్యాదు చేయనున్నారు.
బ్రో ఆర్ధిక లావాదేవీలపై అంబటి ఆరోపణలు :
నిన్న అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ.. బ్రో చిత్ర నిర్మాత టీజీ విశ్వప్రసాద్ తెలుగుదేశం పార్టీకి చెందిన మనిషి అని ఆరోపించారు. విశ్వప్రసాద్‌కు అమెరికాలో సాఫ్ట్‌వేర్ కంపెనీలు వున్నాయని.. చంద్రబాబు, ఆయన ముఠా సభ్యులు అమెరికాలో డబ్బులు వసూలు చేసి విశ్వప్రసాద్‌కు ఇస్తున్నారని.. దానిని ప్యాకేజీ కింద పవన్‌కు ఇస్తున్నారని మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే సినిమా నిర్మాణం వెనుక పెద్ద కుట్ర దాగి వుందని.. బ్లాక్‌మనీని వైట్‌మనీగా మార్చే ప్రక్రియ కొనసాగుతోందని రాంబాబు పేర్కొన్నారు.
అంబటి వ్యాఖ్యల్ని ఖండించిన టీజీ విశ్వప్రసాద్ :
అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలను నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఖండించారు. బ్రో సినిమా బ్లాక్ బస్టర్ అని తేల్చిచెప్పారు. ఓటీటీ రైట్స్ విక్రయాల ద్వారా తమకు మంచి ప్రాఫిట్ వచ్చిందని.. సినిమా వల్ల తమకు లాభాలు వచ్చాయని విశ్వప్రసాద్ పేర్కొన్నారు. అంబటి రాంబాబు అన్నట్లు బ్రో చిత్ర నిర్మాణంలో మనీ రూటింగ్ వంటి వ్యవహారాలు లేవని ఆయన వెల్లడించారు. పవన్ వల్ల బ్రో సినిమాకు క్రేజ్ వచ్చిందని.. కానీ రాజకీయపరంగా ఇలాంటి విమర్శలు వస్తాయని ఊహించలేదన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments