ప్రభాస్, ప్రశాంత్ నీల్, దిల్ రాజు కాంబో.. మైండ్ బ్లోయింగ్ ప్లానింగ్!
Send us your feedback to audioarticles@vaarta.com
రోజు రోజుకు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ క్రేజ్ తారాస్థాయికి చేరుతోంది. దేశవ్యాప్తంగా ఉన్న బడా దర్శకులు ప్రభాస్ డేట్స్ దొరికితే చాలు అన్నట్లుగా ఉన్నారు. కానీ రాబోవు నాలుగైదేళ్ల కోసం కొందరు దర్శకులు ప్రభాస్ ని ఇప్పటికే లాక్ చేశారు. బాహుబలి చిత్రం ప్రభాస్ సత్తాని నార్త్ కు పరిచయం చేసింది.
ఇదీ చదవండి: 400 ట్రైబల్ కుటుంబాలకు అండగా భల్లాల దేవుడు!
నిరాశపరిచినప్పటికీ సాహో కూడా నార్త్ లో వసూళ్ల వర్షం కురిపించింది. దీనితో ప్రభాస్ దర్శక నిర్మాతలకు మోస్ట్ వాంటెడ్ హీరోగా మారిపోయాడు. ప్రస్తుతం ప్రభాస్ రాధే శ్యామ్, సాలార్ చిత్రాల్లో నటిస్తున్నాడు. సాలార్ చిత్రం క్రేజీ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది.
తాజాగా మతిపోగోట్టే న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. ప్రశాంత్ నీల్.. ప్రభాస్ కాంబినేషన్ లో మరో చిత్రం రాబోతోంది. అదే ప్రభాస్ 25వ చిత్రం. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ప్రశాంత్ నీల్ ఈ ప్రాజెక్ట్ ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రభాస్ సిల్వర్ జూబ్లీ మూవీ తెరకెక్కే ఈ చిత్ర కాన్సెప్ట్ ఊహకు అందని విధంగా ఉంటుందట.
బాహుబలిని మించేలా ఓ మైథాలజీ (పురాణ గాధ) కాన్సెప్ట్ తో ఈ చిత్రం ఉంటుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ చిత్రం కోసం ప్రీప్రోడుక్షన్ వర్క్, ప్లానింగ్ కనీవినీ ఎరుగని విధంగా ఉండబోతోంది.
ఇండియన్ స్క్రీన్ పై మునుపెన్నడూ లేని విధంగా ప్రశాంత్ నీల్ ఈ మైథాలజీ కథని చెక్కబోతున్నాడట. ఈ ప్రాజెక్ట్ కు ప్రిపరేషన్ బాగా అవసరం. కాబట్టి ప్రభాస్ ముందుగా తాను కమిటై ఉన్న రాధే శ్యామ్, సాలార్, ఆది పురుష్, నాగ్ అశ్విన్ చిత్రాలని పూర్తి చేస్తాడు. ఈ న్యూస్ బయటకు రాగానే సోషల్ మీడియాలో ట్రెండింగ్ షురూ అయ్యింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com