సలార్ లో దిమ్మతిరిగిపోయే ఛేజ్ సీన్.. వింటేజ్ బైక్ పై ప్రభాస్
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ షూటింగ్ పూర్తి కావస్తోంది. ఈ చిత్రం రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. అందాల బుట్టబొమ్మ పూజా హెగ్డే ఈ మూవీలో హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ చిత్రం కూడా వేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది.
ప్రస్తుతం చిత్ర యూనిట్ ప్రభాస్ పై భారీ ఛేజ్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నారు. వింటేజ్ బైక్ పై రైడ్ కు రెడీగా ఉన్న ప్రభాస్ లొకేషన్ స్టిల్ బయటకు వచ్చింది. ఈ యాక్షన్ ఛేజ్ సీన్ పై బయటకు వస్తున్న ఆసక్తికర విషయాలు సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాయి. పైగా దర్శకుడు ప్రశాంత్ నీల్ యాక్షన్ ఎపిసోడ్స్ ఎలా డిజైన్ చేస్తారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
ఇదీ చదవండి: మెగా హీరోకి నాగార్జున అంత రెమ్యునరేషన్ ఇవ్వనున్నడా?
ఈ ఛేజ్ సీన్ కోసం ప్రశాంత్ నీల్ ఓ ప్రత్యేకమైన వింటేజ్ బైక్ ని తెప్పించారట. నిర్మాతలు ఈ ఒక్క ఛేజ్ సీన్ కోసం భారీ స్థాయిలో ఖర్చు చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో యాక్షన్ సీక్వెన్స్ హాలీవుడ్ స్టాండర్డ్స్ కు సమానంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇండియన్ సినిమాలో ది బెస్ట్ అనిపించే విధంగా ఉంటాయట.
యాక్షన్ ఎపిసోడ్స్ మాత్రమే కాదు ప్రభాస్ అభిమానులు కోరుకునే అన్ని థ్రిల్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయని తెలుస్తోంది. బైక్ సీన్లు, కారు సన్నివేశాలు ఇటీవల ప్రభాస్ కు కామన్ గా మారిపోయాయి. రాధేశ్యామ్ లో ప్రభాస్ వింటేజ్ కార్లని ఉపయోగిస్తాడట. ఇక సాహోలో ప్రభాస్ ట్రిమ్ఫ్ స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ఎస్ బైక్ ని ఉపయోగించిన సంగతి తెలిసిందే. ఆ యాక్షన్ బ్లాక్ ని భారీ ఖర్చుతో చిత్రీకరించారు. కానీ సాహో ప్రేక్షలకులని మెప్పించలేకపోయింది.
కానీ ప్రస్తుతం సలార్ పై కనీవినీ ఎరుగని అంచనాలు ఉన్నాయి. తొలిసారి శృతి హాసన్ ప్రభాస్ సరసన ఈ చిత్రంలో నటిస్తోంది. రాధేశ్యామ్, సలార్ తర్వాత ప్రభాస్ చిత్రాల లైనప్ భారీగా ఉంది. రామాయణం నేపథ్యంలో ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ చిత్రంలో ప్రభాస్ నటిస్తున్నాడు. అలాగే నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రపంచస్థాయిలో విలువలతో ఓ చిత్రం ప్రకటించిన సంగతి తెలిసిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com