MIM Party:ఎంఐఎం పార్టీ కీలక ప్రకటన.. 9 స్థానాల్లో పోటీకి సై..

  • IndiaGlitz, [Friday,November 03 2023]

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో పోటీపై ఎంఐఎం పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. తమ కంచుకోట స్థానాలైన ఏడు నియోజకవర్గాలతో పాటు మరో రెండు నియోజకవర్గాల్లో ఈసారి పోటీకి దిగనున్నట్లు ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ వెల్లడించారు. దీంతో మొత్తం 9 స్థానాల్లో ఎంఐఎం బరిలో దిగనుందని తెలిపారు. సిట్టింగ్ స్థానాలు చాంద్రాయణగుట్ట, యాకుత్‌పురా, చార్మినార్, బహుదూర్‌పురా, కార్వాన్, నాంపల్లి, మలక్‌పేట స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించారు. అయితే కొత్తగా పోటీ చేసే జూబ్లీహిల్స్, రాజేంద్రనగర్ స్థానాల్లో అభ్యర్థులను త్వరలోనే ప్రకటిస్తామన్నారు. అసదుద్దీన్ ఒవైసీ ప్రకటన ఇప్పుడు చర్చనీయాంశమైంది.

గత కొన్ని దశాబ్దాల నంచి ఎంఐఎం పార్టీ పాతబస్తీలోని ఏడు స్థానాల్లోనే పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడు స్థానాలు ఆ పార్టీకి కంచుకోటగా మారిపోయాయి. అక్కడ ఆ పార్టీ తరపున ఎవరు పోటీ చేసినా సులువుగా గెలుస్తూ ఉంటారు. అయితే ఈసారి మాత్రం వీటితో పాటు మరికొన్ని స్థానాల్లో పోటీ చేస్తామని గతంలోనే అసదుద్దీన్ ప్రకటించారు. అందుకు తగ్గట్లుగానే మరో రెండు నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నట్లు తెలిపారు. అయితే ఈ రెండు నియోజకవర్గాలు ముస్లింల ప్రభావం తక్కవగా ఉన్నవి కావడం గమనార్హం.

ఎంఐఎం అభ్యర్థులు వీరే..

చాంద్రాయణగుట్ట- అక్బరుద్దీన్ ఒవైసీ
చార్మినార్- మీర్ జుల్ఫీకర్ అలీ సాహబ్ (మాజీ మేయర్)
యాకుత్‌పురా- జాఫర్ హుస్సేన్ మెహరాజ్ సాహబ్
మలక్‌పేట- అహ్మద్ బలాలా
కార్వాన్- కౌసర్ మొహియుద్దీన్ సాహబ్
నాంపల్లి- మాజిద్ హుస్సేన్ సాహబ్

More News

AP Cabinet:కులగణనకు గ్రీన్ సిగ్నల్.. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు.. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు..

ఏపీ మంత్రివర్గ సమావేశం ముగిసింది. సీఎం జగన్ అధ్యక్షతన సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది.

Ramakrishna Reddy:కాంగ్రెస్‌కు షర్మిల మద్దతు ఇవ్వడంపై.. సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు..

తెలంగాణ ఎన్నికల్లో పోటీకి వైసీటీపీ అధినేత షర్మిల దూరం కావడంపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి  కీలక వ్యాఖ్యలు చేశారు.

Rishabh Pant and Akshar Patel:తిరుమల శ్రీవారిని దర్శించుకున్న భారత క్రికెటర్లు రిషబ్ పంత్, అక్షర్ పటేల్

భారత క్రికెటర్లు రిషబ్ పంత్, అక్షర్ పటేల్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

KCR Kasani:బీఆర్ఎస్‌లో చేరిన కాసాని.. సాదరంగా ఆహ్వానించిన సీఎం కేసీఆర్..

తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ బీఆర్ఎస్ పార్టీలో చేరారు.

Bharatiyadudu 2:అదిరిపోయిన భారతీయుడు2 ఇంట్రో.. గూస్‌బంప్స్ పక్కా..

లోకనాయకుడు కమల్ హాసన్, అగ్ర డైరెక్టర్ శంకర్ కలయికలో ఇండియన్-2 చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే.