MIM Party:ఎంఐఎం పార్టీ కీలక ప్రకటన.. 9 స్థానాల్లో పోటీకి సై..
- IndiaGlitz, [Friday,November 03 2023]
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో పోటీపై ఎంఐఎం పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. తమ కంచుకోట స్థానాలైన ఏడు నియోజకవర్గాలతో పాటు మరో రెండు నియోజకవర్గాల్లో ఈసారి పోటీకి దిగనున్నట్లు ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ వెల్లడించారు. దీంతో మొత్తం 9 స్థానాల్లో ఎంఐఎం బరిలో దిగనుందని తెలిపారు. సిట్టింగ్ స్థానాలు చాంద్రాయణగుట్ట, యాకుత్‌పురా, చార్మినార్, బహుదూర్‌పురా, కార్వాన్, నాంపల్లి, మలక్‌పేట స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించారు. అయితే కొత్తగా పోటీ చేసే జూబ్లీహిల్స్, రాజేంద్రనగర్ స్థానాల్లో అభ్యర్థులను త్వరలోనే ప్రకటిస్తామన్నారు. అసదుద్దీన్ ఒవైసీ ప్రకటన ఇప్పుడు చర్చనీయాంశమైంది.
గత కొన్ని దశాబ్దాల నంచి ఎంఐఎం పార్టీ పాతబస్తీలోని ఏడు స్థానాల్లోనే పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడు స్థానాలు ఆ పార్టీకి కంచుకోటగా మారిపోయాయి. అక్కడ ఆ పార్టీ తరపున ఎవరు పోటీ చేసినా సులువుగా గెలుస్తూ ఉంటారు. అయితే ఈసారి మాత్రం వీటితో పాటు మరికొన్ని స్థానాల్లో పోటీ చేస్తామని గతంలోనే అసదుద్దీన్ ప్రకటించారు. అందుకు తగ్గట్లుగానే మరో రెండు నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నట్లు తెలిపారు. అయితే ఈ రెండు నియోజకవర్గాలు ముస్లింల ప్రభావం తక్కవగా ఉన్నవి కావడం గమనార్హం.
ఎంఐఎం అభ్యర్థులు వీరే..
చాంద్రాయణగుట్ట- అక్బరుద్దీన్ ఒవైసీ
చార్మినార్- మీర్ జుల్ఫీకర్ అలీ సాహబ్ (మాజీ మేయర్)
యాకుత్‌పురా- జాఫర్ హుస్సేన్ మెహరాజ్ సాహబ్
మలక్‌పేట- అహ్మద్ బలాలా
కార్వాన్- కౌసర్ మొహియుద్దీన్ సాహబ్
నాంపల్లి- మాజిద్ హుస్సేన్ సాహబ్