వన్ మిలియన్ వ్యూస్ అందుకున్న 'నేను లేను' టీజర్
Send us your feedback to audioarticles@vaarta.com
ఓ.యస్.యం విజన్ మరియు దివ్యాషిక క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం "నేను లేను". లాస్ట్ ఇన్ లవ్ అనేది ఉపశీర్షిక. హర్షిత్ హీరోగా నటిస్తున్నాడు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. టీజర్ విడుదలై వన్ మిలియన్ వ్యూస్ ను అందుకుంది.
ఈ సందర్భంగా దర్శకుడు రామ్ కుమార్ మాట్లాడుతూ ... అందమైన ప్రేమకథతో సైకలాజికల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన చిత్రం నేను లేను . ఇటివలే విడుదలైన మా టీజర్ కి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ రావడం చాల ఆనందంగా ఉంది .మంచి కాన్సప్ట్ తో సినీమా తీస్తే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు అనే నమ్మకం తో తీసిన చిత్రం " నేను లేను " విడుదలైన మా టీజర్ కి వన్ మిలియన్ వ్యూస్ రావడం సినీమా పై మరింత నమ్మకాన్ని పెంచింది . అన్నీ కార్యక్రమాలు పూర్తి చేసి త్వరలోనే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం . ఇప్పటివరకు సినీ చరిత్ర లో రాని సరికొత్త కాన్సెప్ట్ తో వస్తున్న చిత్రం అని చెప్పడానికి చాలా గర్వంగా ఫీల్ అవుతున్నానన్నారు.
హర్షిత్, వంశీకృష్ణ పాండ్య, శ్రీపద్మ, మాధవి, బిశ్వజిత్నాధ్, రుద్రప్రకాశ్, వేల్పుల సూరి, యుగంధర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం:ఆశ్రిత్, ఛాయాగ్రహణం:ఎ. శ్రీకాంత్ (బి.ఎఫ్.ఎ), నృత్యాలుఃజోజో, నిర్వాహణ:సురేష్కూరపాటి, పి.ఆర్.ఓ:సాయిసతీష్ , విఎఫ్ఎక్స్: ప్రభురాజ్, ఎస్.ఎఫ్.ఎక్స్:పురుషోత్తం రాజు, ఆడియోగ్రఫీ:రంగరాజ్, కలరిస్ట్ః కళ్యాణ్ ఉప్పాలపాటి, ప్రచార చిత్రాలు: శ్రీక, సహాయదర్శకులు: జె.మోహన్కాంత్, దర్మేంద్ర, సురేశ్. సహ నిర్మాత : యాషిక , నిర్మాత : సుక్రి కుమార్ రచన , దర్శకత్వం : రామ్ కుమార్ ఎమ్ .ఎస్ .కె
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Diya Harini
Contact at support@indiaglitz.com