పెళ్లి వార్తలపై మిల్కీ బ్యూటీ స్పందన...
Send us your feedback to audioarticles@vaarta.com
మిల్కీ బ్యూటీ తమన్నా త్వరలోనే అమెరికాకు చెందిన ఓ డాక్టర్ను పెళ్లి చేసుకోనుందని వార్తలు ఇటీవల సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే. ఈ వార్తలపై తమన్నా ట్విట్టర్ వేదికగా స్పందించింది. ``నేను ప్రస్తుతం సింగిల్గానే ఉన్నా... మొన్న క్రికెటర్.. నిన్న ఓ యాక్టర్.. ఇప్పుడేమో ఓ డాక్టర్.. వ్యక్తిగత జీవితానికి సంబంధించిన నిరాధారమైన వార్తలు రాయడం సహించరానిది.
ఇలాంటి వార్తలను రాయడం చట్టప్రకారం.. గౌరవ ప్రదంగా మంచిది కాదు. నా పెళ్లికి సంబంధించిన విషయాలు ఏమైన ఉంటే నేను నా అభిమానులతో పంచుకుంటాను`` అంటూ ఘాటుగానే స్పందించారు. తమన్నా నేరుగా స్పందించడంతో ఆమె పెళ్లికి సంబంధించిన వార్తలకు చెక్ పడ్డట్టు అయ్యింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments