పెళ్లి వార్తలపై మిల్కీ బ్యూటీ స్పందన...
- IndiaGlitz, [Saturday,July 28 2018]
మిల్కీ బ్యూటీ తమన్నా త్వరలోనే అమెరికాకు చెందిన ఓ డాక్టర్ను పెళ్లి చేసుకోనుందని వార్తలు ఇటీవల సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే. ఈ వార్తలపై తమన్నా ట్విట్టర్ వేదికగా స్పందించింది. ''నేను ప్రస్తుతం సింగిల్గానే ఉన్నా... మొన్న క్రికెటర్.. నిన్న ఓ యాక్టర్.. ఇప్పుడేమో ఓ డాక్టర్.. వ్యక్తిగత జీవితానికి సంబంధించిన నిరాధారమైన వార్తలు రాయడం సహించరానిది.
ఇలాంటి వార్తలను రాయడం చట్టప్రకారం.. గౌరవ ప్రదంగా మంచిది కాదు. నా పెళ్లికి సంబంధించిన విషయాలు ఏమైన ఉంటే నేను నా అభిమానులతో పంచుకుంటాను'' అంటూ ఘాటుగానే స్పందించారు. తమన్నా నేరుగా స్పందించడంతో ఆమె పెళ్లికి సంబంధించిన వార్తలకు చెక్ పడ్డట్టు అయ్యింది.