Migjam Typhoon:మిగ్జాం తుఫాన్ ఎఫెక్ట్.. తెలంగాణకూ భారీ వర్ష సూచన..
Send us your feedback to audioarticles@vaarta.com
ఏపీలోని మిగ్జాం తుఫాన్ ప్రభావం కారణంగా తెలంగాణలోనూ రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం నెల్లూరు నుంచి మచిలీపట్నం వైపు సాగుతున్న తుఫాన్.. మరికొన్ని గంటల్లో బాపట్ల-దివిసీమ మధ్య తీరం దాటనుంది. దీని ప్రభావంతో ఇప్పటికే ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తీర ప్రాంతాల్లో గంటకు 90-100 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. ఈ ప్రభావం తెలంగాణ రాష్ట్రంపైన పడుతుంది. ఇప్పటికే హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి.
రెండు రోజుల పాటు భద్రాద్రి-కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, నాగర్‌కర్నూల్, మహబూబాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతారణ కేంద్రం పేర్కొంది. భూపాలపల్లి, ములుగు, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.ఈ మేరకు ఆయా జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీచేసింది. సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంటూ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. కరీంనగర్, పెద్దపల్లి, నల్లగొండ, జనగామ, యాదాద్రి-భువనగిరి, జయశంకర్ భూపాలపల్లి, సిద్దిపేట, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. వరంగల్, హన్మకొండ, కరీంనగర్, పెద్దపల్లి, నల్లగొండ, జనగామ, యాదాద్రి-భువనగిరి, జయశంకర్ భూపాలపల్లి, సిద్దిపేటతో పాటు పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వెల్లడిస్తూ ఎల్లో అలర్ట్‌ను జారీచేసింది.
తుఫాను తీరం దాటే సమయంలో భారీ విధ్వంసం ఉంటుందని కోస్తాంధ్ర ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే తుఫాను కారణంగా నెల్లూరు, తిరుపతి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తుండగా.. మిగతా జిల్లాల్లోనూ మోస్తరు వర్షాలు పడుతున్నాయి. భారీ ఈదురుగాలులతో కొన్నిచోట్ల చెట్లు నేలకొరిగాయి. వర్షాల ధాటికి పంట పొలాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. మరోవైపు అధికారులు అప్రమత్తంగా ఉంటూ సహాయక చర్యలు ముమ్మరం చేయాలని సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఎప్పటికప్పుడు తుఫాన్ పరిస్థితులను అంచనా వేస్తున్నారు. తీరప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments