అరేబియా సముద్రంలో కుప్పకూలిన మిగ్-29కే శిక్షణ విమానం
- IndiaGlitz, [Friday,November 27 2020]
అరేబియా సముద్రంలో మిగ్-29కే శిక్షణ విమానం కుప్పకూలింది. గురువారం రాత్రి గోవాలో ఈ దుర్ఘటన జరిగింది. శిక్షణ విమానంలో ఉన్న ఇద్దరు పైలట్లు అరేబియా సముద్రంలో కూలిపోయింది. కాగా.. ఒక పైలట్ ఆచూకీ లభ్యమైంది. మరో పైలట్ కోసం నేవీ అధికారులు గాలిస్తున్నారు. గోవాలోని ఐఎన్‌ఎస్ హన్సా నుంచి మిగ్-29కే విమానం బయలుదేరింది. ప్రమాద ఘటనపై నేవీ అధికారులు దర్యాప్తునకు ఆదేశించారు. ఈ ఏడాదిలోనే మిగ్-29కే విమానం కుప్పకూలడం ఇది మూడోసారి కావడం గమనార్హం.
గతేడాది నవంబర్ 16న మిగ్-29కె శిక్షణ విమానం దక్షిణ గోవా జిల్లాలోని వెర్నా గ్రామం వెలుపల కూలిపోయింది. కాగా.. ఈ ఏడాది ఫిబ్రవరి 23న మిగ్-29కె విమానం పక్షి ఢీకొనడంతో గోవాలో కుప్పకూలింది. అయితే ఈ రెండు ఘటనల్లో పైలెట్స్ ఇద్దరూ క్షేమంగానే ప్రమాదం నుంచి బయటపడ్డారు. ట్విన్ ఇంజిన్ రష్యన్ తయారు చేసిన విమానం గోవాలోని నావికాదళ వైమానిక కేంద్రం ఐఎన్ఎస్ హన్సాలో ఉంది. ఈ నౌకాదళంలో కొంత భాగం విశాఖపట్నం వద్ద తూర్పు తీరంలో ఐఎన్ఎస్ దేగా వద్ద ఉంది.