మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్ల ఇంట్లో విషాదం.. అనారోగ్యంతో కుమారుడి కన్నుమూత
Send us your feedback to audioarticles@vaarta.com
మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్ల ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. అనారోగ్యంతో ఆయన కుమారుడు జైన్ నాదెళ్ల కన్నుమూశారు. పుట్టుకతోనే కండరాలకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్న జైన్.. సోమవారం ఉదయం ఆరోగ్యం క్షీణించడంతో తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని మైక్రోసాఫ్ట్ సంస్థ తన ఎగ్జిక్యూటివ్ సిబ్బందికి ఈ-మెయిల్ ద్వారా వెల్లడించింది.
సత్య నాదెళ్ల, అను దంపతుల కుమారుడైన జైన్ 1996లో జన్మించాడు. అయితే అతను సెరెబ్రల్ పాల్సీ లక్షణాలతో పుట్టినట్లు వైద్యులు గుర్తించారు. నాటి నుంచి వీల్ ఛెయిర్‌కే పరిమితమవ్వాల్సి వచ్చింది. కుమారుడి పరిస్ధితి చూసి సత్య నాదెళ్ల కుటుంబం ఎంతగానో కుంగిపోయింది. అయినప్పటికి దానిని గుండెల్లోనే దాచుకుని.. తన కొడుకు లాంటి వారికోసం వినూత్న పరికరాలపై సత్యనాదెళ్ల దృష్టిపెట్టారు. మైక్రోసాఫ్ట్ సీఈవోగా 2014లో బాధ్యతలు చేపట్టిన తర్వాత అంగవైకల్యం ఉన్నవారు కూడా సులువుగా యాక్సెస్ చేసేలా మైక్రోసాఫ్ట్ ఉత్పత్తుల్లో అనేక కొత్త మార్పులను తీసుకొచ్చారు.
సత్యనాదెళ్లకు జైన్‌తోపాటు ఇద్దరు కూతుళ్లు కూడా ఉన్నారు. జైన్ నాదెళ్ల సీటెల్ చిల్డ్రన్స్ సెంటర్ ఫర్ ఇంటిగ్రేటివ్ బ్రెయిన్ రీసెర్చ్‌లో పలుమార్లు చికిత్స పొందారు. ఈ హాస్పిటల్ పీడియాట్రిక్ న్యూరోసైన్సెస్‌లో జైన్ నాదెళ్ల ఎండోడ్ చైర్‌ను స్థాపించడానికి సత్యతో గతేడాది చేతులు కలిపింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments