మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్ల ఇంట్లో విషాదం.. అనారోగ్యంతో కుమారుడి కన్నుమూత

  • IndiaGlitz, [Tuesday,March 01 2022]

మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్ల ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. అనారోగ్యంతో ఆయన కుమారుడు జైన్ నాదెళ్ల కన్నుమూశారు. పుట్టుకతోనే కండరాలకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్న జైన్‌.. సోమవారం ఉదయం ఆరోగ్యం క్షీణించడంతో తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని మైక్రోసాఫ్ట్‌ సంస్థ తన ఎగ్జిక్యూటివ్‌ సిబ్బందికి ఈ-మెయిల్‌ ద్వారా వెల్లడించింది.

సత్య నాదెళ్ల, అను దంపతుల కుమారుడైన జైన్‌ 1996లో జన్మించాడు. అయితే అతను సెరెబ్రల్‌ పాల్సీ లక్షణాలతో పుట్టినట్లు వైద్యులు గుర్తించారు. నాటి నుంచి వీల్‌ ఛెయిర్‌కే పరిమితమవ్వాల్సి వచ్చింది. కుమారుడి పరిస్ధితి చూసి సత్య నాదెళ్ల కుటుంబం ఎంతగానో కుంగిపోయింది. అయినప్పటికి దానిని గుండెల్లోనే దాచుకుని.. తన కొడుకు లాంటి వారికోసం వినూత్న పరికరాలపై సత్యనాదెళ్ల దృష్టిపెట్టారు. మైక్రోసాఫ్ట్‌ సీఈవోగా 2014లో బాధ్యతలు చేపట్టిన తర్వాత అంగవైకల్యం ఉన్నవారు కూడా సులువుగా యాక్సెస్ చేసేలా మైక్రోసాఫ్ట్‌ ఉత్పత్తుల్లో అనేక కొత్త మార్పులను తీసుకొచ్చారు.

సత్యనాదెళ్లకు జైన్‌తోపాటు ఇద్దరు కూతుళ్లు కూడా ఉన్నారు. జైన్ నాదెళ్ల సీటెల్ చిల్డ్రన్స్ సెంటర్ ఫర్ ఇంటిగ్రేటివ్ బ్రెయిన్ రీసెర్చ్‌‌లో పలుమార్లు చికిత్స పొందారు. ఈ హాస్పిటల్ పీడియాట్రిక్ న్యూరోసైన్సెస్‌లో జైన్ నాదెళ్ల ఎండోడ్ చైర్‌ను స్థాపించడానికి సత్యతో గతేడాది చేతులు కలిపింది.

More News

మెగాస్టార్ ఫ్యాన్స్‌కి శివరాత్రి కానుక.. ‘భోళా శంకర్’ ఫస్ట్ లుక్ రిలీజ్

టాలీవుడ్ అగ్ర కథానాయకుడు, మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తోన్న సినిమా ‘‘భోళా శంకర్’’.

'సెబాస్టియన్‌ పిసి524’ ట్రైలర్  విడుదల చేసిన సెన్సేనల్ హీరో విజయదేవరకొండ

జ్యోవిత సినిమాస్‌ పతాకంపై కిరణ్‌ అబ్బవరం, కోమలీ ప్రసాద్‌, నివేక్ష (నమ్రతా దరేకర్‌) నటీనటులుగా బాలాజీ సయ్యపురెడ్డి దర్శకత్వంలో

బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌ కోసం అపూర్వమైన ఆరంభాన్ని అందించిన బిగ్‌బాస్‌ అభిమానులు

బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌ కోసం అపూర్వమైన ఆరంభాన్ని అందించిన బిగ్&

లవ్, కామెడీ, సెంటిమెంట్‌ల కలబోత: ఆకట్టుకుంటోన్న ‘ సెబాస్టియన్ పీసీ 524 ’ ట్రైలర్

వినూత్నమైన కథలతో దూసుకెళ్తున్నాడు యువ హీరో కిరణ్ అబ్బవరం.

చిరు వ్యాపారులకు ఆసరా.. 5 లక్షల మంది ఖాతాల్లోకి ‘‘జగనన్న తోడు’’ డబ్బులు

రోడ్ల పక్కన, తోపుడు బండ్లపై పండ్లు, కూరగాయలు అమ్ముకునే చిన్న చిన్న వ్యాపారులు మరో 5,10,462 మందికి ప్రభుత్వం రూ.510.46 కోట్ల