తల్లి గర్భంలో మైక్రో ప్లాస్టిక్.. వైద్య చరిత్రలో ఇదే తొలిసారి..
Send us your feedback to audioarticles@vaarta.com
ప్లాస్టిక్ గురించి ఎన్ని చెప్పినా మనుషుల మెదడులోకి మాత్రం ఎక్కడం లేదు. పర్యావరణానికి తీవ్ర విఘాతం సృష్టిస్తున్న ఈ ప్లాస్టిక్ ప్రస్తుతం మానవ మనుగడకే ప్రశ్నార్థకంగా మారిపోయింది. ఈ నేపథ్యంలోనే డాక్టర్లు ఓ షాకింగ్ విషయాన్ని కనుగొన్నారు. తల్లి గర్భంలో కూడా మైక్రో ప్లాస్టిక్‌ను వైద్యులు గుర్తించారు. తల్లిని గర్భస్థశిశువుతో కలుపుతూ బిడ్డకు పోషకపదార్థాలు అందించే మావిలో(ప్లాసెంటాలో) మైక్రోప్లాస్టిక్స్‌ను కనిపెట్టారు. అలాగే శిశువు చుట్టూ రక్షణగా ఉండే పొరలోనూ వీటిని గుర్తించారు. ఇటువంటి ఘటన వెలుగు చూడటం వైద్య చరిత్రలో ఇదే తొలిసారని వైద్యులు చెబుతున్నారు.
ఈ అతి సూక్ష్మమైన ప్లాస్టిక్ ముక్కలు తల్లి గర్భంలో ఎరుపు, నీలం, నారింజ, రంగుల్లో ఉన్నాయని వైద్యులు వెల్లడించారు. ప్యాకేజింగ్‌కు వాడే ప్లాస్టిక్, పెయింట్లు, లేదా కాస్మెటిక్స్ ద్వారా ఇవి గర్భిణుల శరీరంలోకి ప్రవేశించి ఉంటాయని వారు భావిస్తున్నారు. మొత్తం నలుగురు మహిళల్లో ఇవి బయటపడినట్టు సమాచారం. అయితే.. సదరు గర్భిణులంతా ఆరోగ్యకరమైన సంతానానికి జన్మనివ్వడం గమనార్హం. బిడ్డ గర్భంలో ఉన్నప్పుడే తల్లుల శరీరాల్లో మైక్రోప్లాస్టిక్స్ ప్రవేశించి ఉంటాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. దీనికి రుజువులు మాత్రం లభించలేదు. రోమ్‌లోని శాన్ జియోవానీ క్యాబిలిటా ఆస్పత్రి వైద్యులు ఈ అధ్యనాన్ని చేపట్టారు. ఇందుకు సంబంధించిన వివరాలు..ఎన్విరాన్మెంట్ ఇంటర్నేషనల్ అనే జర్నల్‌లో ఇటీవల ప్రచురితమయ్యాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com