ఆ విషయంలో నా అంచనాలు తప్పుని రుజువు అయ్యాయి - మిక్కి జె.మేయర్
Wednesday, April 5, 2017 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల చాలా మంచి వ్యక్తి. ఆయన ఎన్నో సక్సెస్‌లు సాధించాలి. సినిమా మేకింగ్‌లో ఆయన ఆలోచన బావుంటుంది. ఆయనంటే నాకు చాలా ఇష్టం. బ్రహ్మోత్సవం సినిమా ప్లాప్ కావడం నన్ను ఎంతో బాధించింది. ప్లాప్ కంటే, మహేష్‌పై జోక్స్ రావడం ఇంకా ఎంతో బాధించిందని అంటున్నారు మ్యూజిక్ డైరెక్టర్ మిక్కి జె.మేయర్. వరుణ్‌తేజ్, లావణ్య త్రిపాఠి, హెబ్బా పటేల్ హీరో హీరోయిన్లుగా బేబి భవ్య సమర్పణలో లక్ష్మి నరసింహ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నల్లమలుపు శ్రీనివాస్(బుజ్జి), ఠాగూర్ మధు నిర్మాతలుగా శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం `మిస్టర్`.ఏప్రిల్ 13న సినిమా విడుదల కానుంది.
ఈ సందర్భంగా మిస్టర్ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ మిక్కి జె.మేయర్ సినిమా గురించి మాట్లాడారు...వరుణ్‌తేజ్ చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు. తను హీరో అనేలా ఎక్కడా ఉండదు. అందరితో సరాదాగా కలిసిపోతుంటాడు. వరుణ్ నాకు ఒక ఫ్రెండ్ కంటే ఎక్కువ. వరుణ్ తేజ్ హీరోగా శ్రీనువైట్లగారి దర్శకత్వంలో చేసిన తొలి చిత్రం మిస్టర్. ముకుంద తర్వాత వరుణ్‌తేజ్ హీరోగా చేసిన రెండో సినిమా ఇది. శ్రీనువైట్ల వంటి పెద్ద డైరెక్టర్‌తో పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. ఆయన స్టయిల్లోని ఫుల్ ప్యాకేజ్డ్ కమర్షియల్ ఎంటర్టైనర్.
ముకుంద సినిమాకు నేను మ్యూజిక్ చేసిన సంగతి తెలిసిందే. ఆ సినిమా నిర్మాతల్లో ఒకరైన నల్లమలుపు బుజ్జిగారు మిస్టర్ సినిమా నిర్మాతల్లో ఒకరు కావడంతో ఆయన శ్రీనువైట్లగారి మిస్టర్ గురించి చెప్పి, నువ్వు మ్యూజిక్ చేయాలన్నారు. అలా సినిమాకు నేను మ్యూజిక్ డైరెక్టర్‌గా వర్క్ స్టార్ట్ చేశాను. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో నేను ఎవరినీ పెద్దగా కలిసేవాడిని కాను. అందుకు ముఖ్య కారణం నాకు తెలుగు మీద అప్పట్లో పట్టు లేకపోవడం. అది కాకుండా నేను పెద్దగా ఎవరినీ కలవడానికి ఇష్టపడను. నాకు ఫిలిం ఇండస్ట్రీ వేరే లోకంలా కనపడింది. నాకు నేనే చిన్నవాడిని అనుకుంటాను. తర్వాత నెమ్మదిగా ఇక్కడ అలవాటు పడ్డాను. ఇప్పుడు తెలుగు మాట్లాడుతాను. `కొత్త బంగారు లోకం` తర్వాత మా నాన్నగారికి ఆరోగ్యం బాగలేకపోయింది. ఆ సమయంలో నేను ఆయనతోనే ఉన్నాను. ఆ సమయంలో నేను బాగా డిస్ట్రబ్డ్‌గా ఉన్నాను. ఓ మ్యూజిక్ డైరెక్టర్ మంచి మ్యూజిక్ ఇవ్వాలంటే తన మానసిక స్థితి బావుండాలనుకునే నేను మూడేళ్ళ పాటు ఇండస్ట్రీ దూరమయ్యాను.
నేను పోజిషన్స్ను పట్టించుకోను. దర్శక నిర్మాతలకు, ప్రేక్షకులకు నచ్చే మ్యూజిక్ ఇచ్చే మంచి మ్యూజిక్ డైరెక్టర్‌గా ఉండాలనుకుంటాను. కొన్నిసార్లు నా పాటలు విన్న కొందరు నా గత చిత్రాల్లో పాటలులాగానే ఉన్నాయని అంటారు. కానీ ఓ సంగీత దర్శకుడిగా వేరే ట్యూన్ ఇచ్చానని నాకు తెలుసు. రిథమ్ ఒకేలా ఉండటంతో విన్నవారికి ఒకేలా ఉన్నట్లు అనుకుంటారు.
ముందు నుండి నాకు దక్షిణాది సంగీతం అంటేనే ఇష్టం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల్లోని జానపదాల ఆధారంగా చేసుకుని ఓ ఫోక్ ఆల్బమ్ చేయాలనే ఆలోచన ఉంది. అయితే దానికి ఇంకా సమయం పడుతుంది. అలాగే మ్యూజిక్ చేసే సమయంలో సినిమా సక్సెస్ ఫెయిల్యూర్స్‌ను నేను అంచనా వేయలేను. ఎందుకంటే నాకు హ్యాపీడేస్ సినిమా మ్యూజిక్ చేసే సమయంలో ఇదేంటి..ఇలా ఉంది అనుకున్నాను. కానీ సినిమా పెద్ద హిట్ అయ్యింది. అలాగే రీసెంట్గా శతమానం భవతి సినిమా విడుదలైన తర్వాత దిల్‌రాజుగారికి ఫోన్ చేసి సారీ అని చెప్పాను. అదేంటి ఇంత పెద్ద సూపర్‌హిట్ సినిమాకు నువ్వు మ్యూజిక్ చేశావని ఆయన అన్నారు. అలా నా అంచనాలు తప్పని రుజువయ్యాయి. ప్రస్తుతం సావిత్రి గారి జీవితకథ ఆధారంగా రూపొందనున్న `మహానటి` చిత్రానికి సంగీతం అందించబోతున్నాను. ఈ సినిమాలో 1940-50 పీరియడ్‌లో ఉన్న మ్యూజిక్‌ను ఇస్తున్నాను. అలాగే దిల్‌రాజుగారి బ్యానర్లో మరో మూవీ చేస్తున్నాను.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
Welcome to IndiaGlitz comments! Please keep conversations courteous and relevant to the topic. To ensure productive and respectful discussions, you may see comments from our Community Managers, marked with an "IndiaGlitz Staff" label. For more details, refer to our community guidelines.
- logoutLogout
Login to post comment