అక్క‌డ హ‌వా కొన‌సాగిస్తున్న మిక్కీ

  • IndiaGlitz, [Monday,May 21 2018]

క్లాస్‌ సినిమాలకి కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్న యువ సంగీత దర్శకుడు మిక్కీ జె. మేయర్. ఇప్పటివరకు ఈ స్వరకర్త కెరీర్‌ను పరిశీలిస్తే.. తన క్లాస్ అండ్ మెలోడీ మ్యూజిక్‌తో శ్రోతలను ఆకట్టుకుంటున్న సినిమాలే ఎక్కువ. ఇదిలా ఉంటే.. ఓవర్సీస్‌ వన్ మిలియన్ డాల‌ర్ల క్ల‌బ్‌లో మిక్కీ చిత్రాలు బాగానే హ‌వా చూపిస్తున్నాయి.

అత‌ని తాజా చిత్రం 'మ‌హాన‌టి' ఇప్ప‌టికే రెండు మిలియన్ డాలర్లకు పైగా వసూళ్లను రాబట్టింది. కాగా ఈ క్లబ్‌లో మిక్కీ స్వరపరచిన చిత్రాలను గమనిస్తే.. 2013లో 'సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు' ($1,635K) సినిమాతో తొలిసారి ఈ క్లబ్‌లో అడుగు పెట్టారు. ఆ తర్వాత 'బ్రహ్మోత్సవం' ($1,158K), 'అ ఆ' ($2,449K) సినిమాలతో త‌న ప్ర‌త్యేక‌త‌ను చాటుకున్నారు. మిలియ‌న్ డాల‌ర్ల క్లబ్‌లో రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ (15 సినిమాలు) మొదటి స్థానంలో ఉండ‌గా.. తమన్ రెండో స్థానంలో ఉన్నారు. మూడో స్థానంలో అనూప్ రూబెన్స్‌, మిక్కీ ఉన్నారు.

ఇక 2 మిలియన్ డాల‌ర్ల క్ల‌బ్‌లో.. దేవిశ్రీ ప్రసాద్ (5 సినిమాలు) మొదటి స్థానంలో ఉండగా.. మిక్కి జె. మేయర్ 'అ.ఆ' ($2,449K), 'మహానటి' ($2,041K) చిత్రాలతో రెండో స్థానంలో ఉండ‌డం విశేషం. అలాగే 'బాహుబ‌లి' చిత్రాల స్వ‌ర‌క‌ర్త‌.. 8 మిలియ‌న్ డాల‌ర్ల ప్ల‌స్ క్ల‌బ్‌లో రెండు చిత్రాల‌తో దూసుకుపోతున్నారు.

More News

మ‌హాన‌టి నిర్మాత‌ల‌తో ల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్ చేయ‌నున్న విజ‌య్‌..

‘అర్జున్ రెడ్డి’ విజయం తర్వాత చేతినిండా సినిమాలతో బిజీగా మారిన నటుడు యూత్ స్టార్ విజయ్ దేవరకొండ.

జూన్‌ 1న విశాల్‌ 'అభిమన్యుడు'

మాస్‌ హీరో విశాల్‌ కథానాయకుడిగా విశాల్‌ ఫిల్మ్‌ ఫ్యాక్టరీ పతాకంపై పి.ఎస్‌.మిత్రన్‌ దర్శకత్వంలో తమిళ్‌లో రూపొందిన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ 'ఇరుంబుతెరై'.

'ప్రేమకథా చిత్రమ్' మ్యాజిక్ రిపీట్ అవుద్దా?

‘ఎస్‌.ఎం.ఎస్‌’ ( శివ మనసులో శృతి) చిత్రంతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైన క‌థానాయ‌కుడు సుధీర్ బాబు. ఆ త‌రువాత‌ 'ప్రేమకథా చిత్రమ్', 'ఆడు మగాడ్రా బుజ్జి', 'కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని', 'మోసగాళ్ళకు మోసగాడు'.

ఫ్యాక్షన్ లీడర్‌గా ఎన్టీఆర్?

యంగ్ టైగర్ ఎన్టీఆర్, ఉత్తరాది భామ పూజా హెగ్డే జంటగా ఏస్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో

 సస్పెన్స్ థ్రిల్లర్ గా 'లా' (లవ్ అండ్ వార్)

సమాజంలో ప్రతి మనిషి కి చట్టం, న్యాయానికి లోబడే జీవించాలి. అలా జీవిచడం లేదంటే జరిగే మలుపులు ఎలా ఉంటాయి అనే కథాంశంతో రూపొందిన మూవి 'లా'.. "లవ్ అండ్ వార్" అనేది ఉపశీర్షిక.