అక్కడ హవా కొనసాగిస్తున్న మిక్కీ
Send us your feedback to audioarticles@vaarta.com
క్లాస్ సినిమాలకి కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్న యువ సంగీత దర్శకుడు మిక్కీ జె. మేయర్. ఇప్పటివరకు ఈ స్వరకర్త కెరీర్‌ను పరిశీలిస్తే.. తన క్లాస్ అండ్ మెలోడీ మ్యూజిక్‌తో శ్రోతలను ఆకట్టుకుంటున్న సినిమాలే ఎక్కువ. ఇదిలా ఉంటే.. ఓవర్సీస్ వన్ మిలియన్ డాలర్ల క్లబ్లో మిక్కీ చిత్రాలు బాగానే హవా చూపిస్తున్నాయి.
అతని తాజా చిత్రం 'మహానటి' ఇప్పటికే రెండు మిలియన్ డాలర్లకు పైగా వసూళ్లను రాబట్టింది. కాగా ఈ క్లబ్లో మిక్కీ స్వరపరచిన చిత్రాలను గమనిస్తే.. 2013లో 'సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు' ($1,635K) సినిమాతో తొలిసారి ఈ క్లబ్లో అడుగు పెట్టారు. ఆ తర్వాత 'బ్రహ్మోత్సవం' ($1,158K), 'అ ఆ' ($2,449K) సినిమాలతో తన ప్రత్యేకతను చాటుకున్నారు. మిలియన్ డాలర్ల క్లబ్లో రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ (15 సినిమాలు) మొదటి స్థానంలో ఉండగా.. తమన్ రెండో స్థానంలో ఉన్నారు. మూడో స్థానంలో అనూప్ రూబెన్స్, మిక్కీ ఉన్నారు.
ఇక 2 మిలియన్ డాలర్ల క్లబ్లో.. దేవిశ్రీ ప్రసాద్ (5 సినిమాలు) మొదటి స్థానంలో ఉండగా.. మిక్కి జె. మేయర్ 'అ.ఆ' ($2,449K), 'మహానటి' ($2,041K) చిత్రాలతో రెండో స్థానంలో ఉండడం విశేషం. అలాగే 'బాహుబలి' చిత్రాల స్వరకర్త.. 8 మిలియన్ డాలర్ల ప్లస్ క్లబ్లో రెండు చిత్రాలతో దూసుకుపోతున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout