ఎంజీఆర్ లుక్ లో ఒదిగిపోయిన అరవింద్ స్వామి
- IndiaGlitz, [Friday,January 17 2020]
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవితాన్ని ఆధారంగా చేసుకుని రూపొందుతోన్న చిత్రం 'తలైవి'. బాలీవుడ్‌క్వీన్ కంగనా రనౌత్ టైటిల్ పాత్రలో నటిస్తున్నారు. ఇటీవల చెన్నైలో ప్రారంభమైన ఈ చిత్రం చిత్రీకరణ దశలో ఉంది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఈ చిత్రంలో దివంగత రాజకీయ నాయకుడు ఎం.జి.రామచంద్రన్ పాత్రలో ప్రముఖ నటుడు అరవింద స్వామి నటిస్తుండగా మరో దివంగత నేత కరుణానిధి పాత్రలో ప్రకాశ్‌రాజ్ నటిస్తున్నారు.
శుక్రవారం ఎం.జి.రామచంద్రరావు 103వ జయంతి. ఈ సందర్భంగా ఆయన క్యారెక్టర్ లుక్, టీజర్‌ను విడుదల చేశారు. ఇప్పటికే విడుదల చేసిన జయలలిత లుక్, టీజర్‌కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఎంజీ రామచంద్రన్ లుక్‌ను యూనిట్ విడుదల చేసింది. అప్పటి ఎంజీఆర్ లుక్‌లో అరవింద స్వామి ఒదిగిపోయారు.
డైరెక్టర్ ఎ.ఎల్.విజయ్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని విష్ణు ఇందూరి, శైలే్ ఆర్.సింగ్ నిర్మిస్తున్నారు. బ్లేడ్ రన్నర్, కెప్టెన్ మార్వెల్ వంటి హాలీవుడ్ చిత్రాలకు మేకప్ మేన్‌గా వ్యవహరించిన జాసన్ కొలిన్స్ ఈ చిత్రంలో కంగనా రనౌత్‌ను జయలలితగా చూపిస్తున్నారు.