ఎంజీఆర్ లుక్ లో ఒదిగిపోయిన అరవింద్ స్వామి

  • IndiaGlitz, [Friday,January 17 2020]

త‌మిళ‌నాడు దివంగ‌త ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత జీవితాన్ని ఆధారంగా చేసుకుని రూపొందుతోన్న‌ చిత్రం 'త‌లైవి'. బాలీవుడ్‌క్వీన్ కంగ‌నా ర‌నౌత్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తున్నారు. ఇటీవ‌ల చెన్నైలో ప్రారంభ‌మైన ఈ చిత్రం చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉంది. తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో విడుద‌ల కానుంది. ఈ చిత్రంలో దివంగ‌త రాజ‌కీయ నాయ‌కుడు ఎం.జి.రామ‌చంద్ర‌న్ పాత్ర‌లో ప్ర‌ముఖ న‌టుడు అర‌వింద స్వామి న‌టిస్తుండ‌గా మ‌రో దివంగ‌త నేత క‌రుణానిధి పాత్ర‌లో ప్ర‌కాశ్‌రాజ్ న‌టిస్తున్నారు.

శుక్ర‌వారం ఎం.జి.రామ‌చంద్రరావు 103వ జ‌యంతి. ఈ సంద‌ర్భంగా ఆయ‌న క్యారెక్ట‌ర్ లుక్‌, టీజ‌ర్‌ను విడుద‌ల చేశారు. ఇప్ప‌టికే విడుద‌ల చేసిన జ‌య‌ల‌లిత లుక్‌, టీజ‌ర్‌కి చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఇప్పుడు ఎంజీ రామ‌చంద్ర‌న్ లుక్‌ను యూనిట్ విడుద‌ల చేసింది. అప్ప‌టి ఎంజీఆర్ లుక్‌లో అర‌వింద స్వామి ఒదిగిపోయారు.

డైరెక్ట‌ర్ ఎ.ఎల్‌.విజ‌య్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని విష్ణు ఇందూరి, శైలే్ ఆర్‌.సింగ్ నిర్మిస్తున్నారు. బ్లేడ్ ర‌న్న‌ర్, కెప్టెన్ మార్వెల్ వంటి హాలీవుడ్ చిత్రాల‌కు మేక‌ప్ మేన్‌గా వ్య‌వ‌హ‌రించిన జాస‌న్ కొలిన్స్ ఈ చిత్రంలో కంగ‌నా ర‌నౌత్‌ను జ‌య‌ల‌లిత‌గా చూపిస్తున్నారు.

More News

పూజా హెగ్డే.. భలే ఛాన్స్ కొట్టేసింది!

కన్నడ కస్తూరి పూజా హెగ్డేకు అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. వరుసపెట్టి అగ్రహీరోలతో సినిమాలు చేస్తున్న పూజా.. తాజాగా మరోస్టార్ హీరోతో జతకట్టడానికి రెడీ అవుతోందట. ఇంతకూ ఆయనెవరు అనుకుంటున్నారా..

సురేష్ బాబు కు ఝలక్ ఇచ్చిన అమెజాన్

ఓటీటీలతో తస్మాత్ జాగ్రత్త.. అంటూ సురేశ్ ప్రొడక్షన్స్ అధినేత సురేశ్ బాబు హెచ్చరించిన విషయం తెలిసిందే. నిర్మాణ విలువలతో పాటు.. వ్యాపార విలువలు బాగా తెలిసిన వ్యక్తి కావడంతో..

నైజాం కుర్రాడి తర్వాతి కాంబినేషన్ అదేనా?

నితిన్ చేతినిండా సినిమాలే. జయాపజయాలతో సంబంధం లేకుండా.. వరుసగా సినిమాలు చేయడంలో ఈ నైజాం బుల్లోడు ఎప్పుడూ ముందుంటాడు. దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు నుంచి సంచలన దర్శకుడు

‘ఎఫ్3’పై పెదవి విప్పిన అనిల్

సంక్రాంతి పండుగ.. అనిల్ రావిపూడికి బాగా కలిసి వచ్చింది. వరుసగా రెండో ఏడాది కూడా భారీ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు.

డిస్కోరాజ నుండి మూడో పాట రమ్ పమ్ బమ్ విడుదల

మాస్ మహా రాజ ర‌వితేజ, ఎక్కడికి పోతావు చిన్నవాడా, ఒక్క క్షణం సినిమాల ఫేం వీఐ ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న డిస్కో రాజా సినిమాని రామ్‌ తాళ్లూరి నిర్మిస్తున్నారు.