తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.జి.ఆర్ బయోపిక్
Send us your feedback to audioarticles@vaarta.com
సమాజానికి మార్గదర్శకం చూపిన ఎందరి జీవితాలను ఇప్పుడు సినిమాలుగా తెరరకెక్కిస్తున్నారు. అందులో రాజకీయ నాయకులు కూడా ఉన్నారు. ఇప్పుడు తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎం.జి.రామచంద్రన్ జీవిత చరిత్రను తెరకెక్కించేందుకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. గతంలో కాంగ్రెస్ నేత, మాజీ ముఖ్యమంత్రి కామరాజ్ జీవిత చరిత్ర ఆధారంగా 'కామరాజ్' పేరుతో చిత్రాన్ని నిర్మించిన రమణ కమ్యూనికేషన్స్ సంస్థ ఎంజిఆర్ జీవిత చరిత్ర సినిమాగా నిర్మించేందుకు ముందుకొచ్చింది.
నటుడుగా కొనసాగుతున్న రోజుల్లోనే ఎంజిఆర్ రాజకీయాలంటే ఎంతో ఆసక్తి చూపించేవారు. అప్పట్లో ఆయన ఖాదీ దోవతి, చొక్కా మాత్రమే ధరించేవారు. హీరోగా అందరి ఆదరాభిమానాలను అందుకోవడమే కాకుండా డిఎంకె పార్టీలో క్రియాశీల పాత్ర పోషించారు. అన్నాదురై మరణానంతరం డిఎంకె పార్టీ నుంచి వెళ్ళిపోయి అన్నా డిఎంకె పార్టీని ప్రారంభించారు. ఎంజిఆర్ సినిమా రంగంలో, రాజకీయాల్లో ఎదుర్కొన్న సవాళ్ళు, పడిన కష్టాలు, ప్రత్యర్థుల కుట్రలను ఛేదించి విజయాలు అందుకున్న విధానం ఇత్యాది అంశాలన్నింటినీ చర్చిస్తూ ఎక్కడా రాజీ పడకుండా అప్పట్లో జరిగిన సంఘటనలను యథాతథంగా తెరపై ఆవిష్కరించబోతున్నారు. ఈ చిత్రంలో నటించేందుకు అప్పటి రాజకీయ నాయకుల పోలికలతో వున్న నటీనటుల కోసం నిర్మాణ సంస్థ అన్వేషిస్తోంది
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout