తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.జి.ఆర్ బయోపిక్

  • IndiaGlitz, [Monday,June 26 2017]

స‌మాజానికి మార్గ‌ద‌ర్శ‌కం చూపిన ఎంద‌రి జీవితాల‌ను ఇప్పుడు సినిమాలుగా తెరర‌కెక్కిస్తున్నారు. అందులో రాజ‌కీయ నాయ‌కులు కూడా ఉన్నారు. ఇప్పుడు త‌మిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎం.జి.రామచంద్రన్‌ జీవిత చరిత్రను తెరకెక్కించేందుకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. గతంలో కాంగ్రెస్‌ నేత, మాజీ ముఖ్యమంత్రి కామరాజ్‌ జీవిత చరిత్ర ఆధారంగా 'కామరాజ్‌' పేరుతో చిత్రాన్ని నిర్మించిన రమణ కమ్యూనికేషన్స్‌ సంస్థ ఎంజిఆర్‌ జీవిత చరిత్ర సినిమాగా నిర్మించేందుకు ముందుకొచ్చింది.

నటుడుగా కొనసాగుతున్న రోజుల్లోనే ఎంజిఆర్‌ రాజకీయాలంటే ఎంతో ఆసక్తి చూపించేవారు. అప్పట్లో ఆయన ఖాదీ దోవతి, చొక్కా మాత్రమే ధరించేవారు. హీరోగా అందరి ఆదరాభిమానాలను అందుకోవడమే కాకుండా డిఎంకె పార్టీలో క్రియాశీల పాత్ర పోషించారు. అన్నాదురై మరణానంతరం డిఎంకె పార్టీ నుంచి వెళ్ళిపోయి అన్నా డిఎంకె పార్టీని ప్రారంభించారు. ఎంజిఆర్‌ సినిమా రంగంలో, రాజకీయాల్లో ఎదుర్కొన్న సవాళ్ళు, పడిన కష్టాలు, ప్రత్యర్థుల కుట్రలను ఛేదించి విజయాలు అందుకున్న విధానం ఇత్యాది అంశాలన్నింటినీ చర్చిస్తూ ఎక్కడా రాజీ పడకుండా అప్పట్లో జరిగిన సంఘటనలను యథాతథంగా తెరపై ఆవిష్కరించబోతున్నారు. ఈ చిత్రంలో నటించేందుకు అప్పటి రాజకీయ నాయకుల పోలికలతో వున్న నటీనటుల కోసం నిర్మాణ సంస్థ అన్వేషిస్తోంది

More News

జూన్ 30న విడుదలకానున్న సంపూర్ణేష్ బాబు 'వైరస్'

సంపూర్ణేష్ బాబు టైటిల్ పాత్రలో ఎ.ఎస్.ఎన్ ఫిలిమ్స్ పతాకంపై ఎస్.ఆర్.కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం "వైరస్". "నో వేక్సిన్, ఓన్లీ టాక్సిన్" అనేది ట్యాగ్ లైన్. గీత్ షా కథానాయిక. సలీమ్.ఎం.డి-శ్రీనివాస్ వంగాల సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని పుల్లరేవు రామచంద్రారెడ్డి సమర్పిస్తున్నారు.

దసరా కానుకగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ 'జై లవకుశ'

`టెంపర్`, `నాన్నకు ప్రేమతో`, `జనతాగ్యారేజ్` వంటి బ్లాక్బస్టర్స్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న చిత్రం `జై లవకుశ`. నందమూరి తారక రామారావు ఆర్ట్స్ బ్యానర్పై నందమూరి కళ్యాణ్ రామ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

హీరో రవితేజ సోదరుడు...నటుడు భరత్ మృతి

ప్రముఖ హీరో రవితేజ సోదరుడు భరత్ కారు ప్రమాదంలో మరణించారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం కొత్వాల్ గూడ సమీపంలో జౌటర్ రింగ్ రోడ్డుపై ఆగి ఉన్న లారీని భరత్ ప్రయాణిస్తున్న కారు ఢీ కొట్టింది.

'కురుక్షేత్రం' తెలుగు ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుంది - యాక్షన్ కింగ్ అర్జున్

వెండితెరపై మార్షల్ ఆర్ట్స్ కు మంచి గుర్తింపు తెచ్చిన అర్జున్.. ఇమేజ్ నే ఇంటిపేరుగా మార్చుకుని యాక్షన్ కింగ్ గా మారాడు. యాక్షన్ హీరోగా దక్షిణాది ప్రేక్షకులందరికీ సుపరిచుతుడైన అర్జున్..

ఈనెల 30న ప్రేక్షకుల ముందుకు వస్తున్న 'ఖయ్యూంభాయ్'

గ్యాంగ్స్టర్ నయీం జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న సినిమా-`ఖయ్యూం భాయ్`. నయీమ్ పాత్రలో కట్టా రాంబాబు, ఏసీపీ పాత్రలో తారకరత్న నటిస్తున్నారు.