ఎస్పీ బాలు హెల్త్ బులిటెన్‌ను విడుదల చేసిన ఎంజీఎం..
Send us your feedback to audioarticles@vaarta.com
గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యానికి సంబంధించిన హెల్త్ బులిటెన్‌ను ఎంజీఎం ఆసుపత్రి వర్గాలు విడుదల చేశాయి. ఇంకా ఆయన వెంటిలేటర్, ఎక్మో సహాయంతోనే చికిత్స పొందుతున్నారని వెల్లడించాయి. ప్రస్తుతం ఎస్పీబీ ఆరోగ్యం నిలకడగానే ఉందని వెల్లడించాయి. ‘‘కరోనా కారణంగా ఎంజీఎం హెల్త్ కేర్‌లో చేరిన ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం ఇంకా వెంటిలేదర్, ఎక్మో సహాయంతో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతానికి ఆయన ఐసీయూలోనే ఉన్నారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. వైద్య నిపుణుల బృందం నిరంతరం ఆయన ఆరోగ్యస్థితిని పర్యవేక్షిస్తోంది’’ అని ఎంజీఎం హాస్పిటల్ వెల్లడించింది.
కాగా.. నేడు ఆయన ఆరోగ్య పరిస్థితిపై కాస్త గందరగోళం నెలకొన్న విషయం తెలిసిందే. తొలుత ఎస్పీ బాలు కుమారుడు ఎస్పీ చరణ్ పీఆర్వో నిఖిల్ సోషల్ మీడియా వేదికగా ఓ ప్రకటనను విడుదల చేసి గందరగోళం సృష్టించారు. బాలుకి కరోనా నెగిటివ్ అని ఫేస్‌బుక్ వేదికగా నిఖిల్ ప్రకటన విడుదల చేశారు. దీంతో బాలు ఆరోగ్యం ఇక కుదుటపడినట్టేనని భావించి అభిమానులంతా సంతోషించారు. ఈ లోపే ఆ వార్తల్లో నిజం లేదని ఓ వీడియో ఎస్పీ చరణ్ విడుదల చేశారు.
‘‘ఎంజీఎం ఆసుప్రతికి సంబంధించిన మెడికల్ టీంను సంప్రదించిన అనంతరమే నేను సాధారణంగా నా తండ్రి హెల్త్ అప్‌డేట్‌ను ఇస్తుంటాను. కానీ దురదృష్టవశాత్తు ఉదయం నుంచి ఓ పుకారు షికారు చేస్తోంది. నాన్నగారి ఆరోగ్యానికి సంబంధించిన ఎలాంటి అప్‌డేట్ అయినా నేనే ఇస్తూ ఉంటాను. కానీ ఇవాళ నాన్నగారికి కరోనా నెగిటివ్ వచ్చిందంటూ ఓ రూమర్ వైరల్ అవుతోంది. నాన్నగారికి కరోనా నెగిటివా? పాజిటివా? అనేది పక్కనబెడితే.. ఆయన లైఫ్ సపోర్ట్ పైనే ఆధారపడ్డారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. అది కోలుకునేందుకు ఇది సహకరిస్తుందని భావిస్తున్నా’’ అని ఎస్పీ చరణ్ తెలిపారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout