ఎస్పీ బాలు హెల్త్ బులిటెన్‌ను విడుదల చేసిన ఎంజీఎం..
Send us your feedback to audioarticles@vaarta.com
గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులిటెన్‌ను ఎంజీఎం వైద్యులు విడుదల చేశారు. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితిలో పెద్దగా మార్పేమి లేదని ఎంజీఎం వైద్యులు వెల్లడించారు. ఇంకా ఎక్మో సాయంతో ఐసీయూలో బాలు ఉన్నట్టు ఎంజీఎం ఆసుపత్రి వెల్లడించింది. వైద్య నిపుణులు ఆయన ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షిస్తున్నారని తెలిపింది.
‘‘ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఇప్పటికీ ఐసీయూలో వెంటిలేటర్‌పై ఎక్మో సాయంతో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. నిపుణఉలైన వైద్యులు ఆయన ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఆయన ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్న వారిలో ఇంటర్నల్ మెడిసిన్, క్రిటికల్ కేర్, పల్మనాలజీ, ఇన్ఫెక్టివ్ డిసీజెస్, ఎక్మోకేర్ విభాగాలకు చెందిన వైద్య నిపుణులున్నారు. వీరంతా అంతర్జాతీయ స్థాయి వైద్య నిపుణులతో అనుసంధానమై ఉన్నారు. యూకే, యూఎస్‌లో ఎందరో కరోనా రోగులకు ఎక్మో సాయంతో అక్కడి వైద్యులు చికిత్స చేశారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కోలుకోవడానికి మా నిపుణులు అందిస్తున్న వైద్యం పట్ల వారు సంతోషం వ్యక్తం చేశారు’’ అని ఎంజీఎం ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.
ఆగస్ట్ 5వ తేదీన తనకు కరోనా సోకిందని ప్రస్తుతం తాను ఆరోగ్యంగానే ఉన్నానని తెలియజేస్తూ ఆయన ఓ వీడియోను ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం విడుదల చేసిన విషయం తెలిసిందే. జలుబు, జ్వరం తప్ప తన ఆరోగ్యం బాగానే ఉందని ఎవరూ కంగారు పడొద్దని సూచించారు. వైద్యులు తనను సెల్ఫ్ క్వారంటైన్లో ఉండమని సూచించారని కానీ తన కుటుంబ సభ్యులకు ఇబ్బంది అవుతుందని తాను ఆసుపత్రిలో చేరినట్టు తెలిపారు. తన స్నేహితులంతా ఆసుపత్రిలోనే ఉన్నారని.. తనను జాగ్రత్తగా చూసుకుంటున్నారని వెల్లడించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments