నేటి నుంచి మధ్యాహ్నం 12.45 వరకూ మెట్రో పరుగులు

లాక్‌డౌన్‌ను మరో పది రోజుల పాటు పొడిగిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. నేటి నుంచి జూన్‌ 9 వరకు పొడిగించింది. ఈ క్రమంలోనే రిలాక్సేషన్ సమయాన్ని సైతం మరో మూడు గంటల పాటు పెంచింది. అయితే ఇప్పటివరకు సడలింపు ఇస్తున్న సమయాన్ని భారీగా పెంచింది. ప్రస్తుతం ఉదయం 6 నుంచి 10 గంటల వరకు సడలింపునిస్తుండగా.. దీనిని ఉదయం 6 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పెంచింది. పైగా వివిధ పనుల కోసం బయటకు వచ్చేవారు తిరిగి ఇళ్లకు చేరుకునేందుకు మధ్యాహ్నం 2 గంటల వరకు అవకాశమిచ్చింది.

ఈ సడలింపు పెంపు సోమవారం నుంచి అమల్లోకి వస్తుంది. ఆదివారం జరిగిన రాష్ట్ర మంత్రిమండలి సమావేశం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే సోమవారం నుంచి పది రోజుల పాటు ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు మూడు కారిడార్ల పరిధిలో మెట్రో రైళ్లు నడవనున్నాయి. కాగా... ప్రయాణికులు కొవిడ్‌ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ఎల్‌అండ్‌టీ ఎండీ కేవీబీ రెడ్డి తెలిపారు.

More News

ప్రేయసి వెంటిలేటర్‌పై ఉండగానే తాళి కట్టాడు.. కానీ..

కరోనా మహమ్మారి తొలి వేవ్ కంటే సెకండ్ వేవ్ మరింత దారుణంగా ఉంది. ఎన్నో కుటుంబాల్లో విషాదాన్ని నింపుతోంది. కనీసం కుటుంబ సభ్యులంతా కలిసి కరోనా మృతులకు గౌరవప్రదంగా

ఆనందయ్యను ఎందుకు ఇంతలా వేధిస్తున్నారు?

ఆనందయ్య మందుపై ఏపీ హైకోర్టులో నేడు విచారణ జరిగింది. ఆనందయ్య మందుపై ప్రభుత్వం ఇప్పటి వరకు ఎటువంటి ఉత్తర్వులు జారీ చేసిందని హైకోర్టు ప్రశ్నించింది.

దివి స్టన్నింగ్ హాట్: ఎదపై టాటూ.. రేర్ రికార్డ్ కొట్టేసింది

యంగ్ బ్యూటీ దివి వాద్త్యా పేరు మారుమోగిపోతోంది. బిగ్ బాస్ 4 తో వెలుగులోకి వచ్చిన ఈ బ్యూటీ టాలీవుడ్ లో పాపులారిటీ పెంచుకుంటోంది. ఇప్పుడిప్పుడే దివికి అవకాశాలు వస్తున్నాయి.

కరోనా వైరస్ వూహాన్ ల్యాబ్‌లో పుట్టిందే..!

కరోనా కచ్చితంగా ల్యాబ్‌లో తయారుచేసిన కృత్రిమ వైరసా? అంటే అవుననే అంటున్నారు యూరోపియన్‌ శాస్త్రవేత్తలు. వూహాన్ ల్యాబ్ నుంచి కరోనా ఉద్భవించిందంటూ ఇప్పటి వరకూ ఎన్నో విమర్శలు వచ్చాయి.

తండ్రికి మహేష్ బ్యూటిఫుల్ విషెష్.. నమ్రత ఎమోషనల్

నేడు సూపర్ స్టార్ కృష్ణ తన 78వ జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నారు. తెలుగు తెరపై ఆయన సాధించిన ఘనతలు అనితరసాధ్యమైనవి. ప్రయోగాలకు,