నేటి నుంచి మధ్యాహ్నం 12.45 వరకూ మెట్రో పరుగులు
Send us your feedback to audioarticles@vaarta.com
లాక్డౌన్ను మరో పది రోజుల పాటు పొడిగిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. నేటి నుంచి జూన్ 9 వరకు పొడిగించింది. ఈ క్రమంలోనే రిలాక్సేషన్ సమయాన్ని సైతం మరో మూడు గంటల పాటు పెంచింది. అయితే ఇప్పటివరకు సడలింపు ఇస్తున్న సమయాన్ని భారీగా పెంచింది. ప్రస్తుతం ఉదయం 6 నుంచి 10 గంటల వరకు సడలింపునిస్తుండగా.. దీనిని ఉదయం 6 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పెంచింది. పైగా వివిధ పనుల కోసం బయటకు వచ్చేవారు తిరిగి ఇళ్లకు చేరుకునేందుకు మధ్యాహ్నం 2 గంటల వరకు అవకాశమిచ్చింది.
ఈ సడలింపు పెంపు సోమవారం నుంచి అమల్లోకి వస్తుంది. ఆదివారం జరిగిన రాష్ట్ర మంత్రిమండలి సమావేశం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే సోమవారం నుంచి పది రోజుల పాటు ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు మూడు కారిడార్ల పరిధిలో మెట్రో రైళ్లు నడవనున్నాయి. కాగా... ప్రయాణికులు కొవిడ్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ఎల్అండ్టీ ఎండీ కేవీబీ రెడ్డి తెలిపారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com