గాలివాన ఎఫెక్ట్.. హైదరాబాద్‌లో ఆగుతున్న మెట్రో!

  • IndiaGlitz, [Sunday,April 21 2019]

తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో గత మూడ్రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. ఈ వర్షం థాటికి ఇళ్లలో నుంచి బయటికి రావాలంటే జనాలు బెంబేలెత్తిపోతున్నారు. మరోవైపు వాహనదారులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. ఇదిలా ఉంటే.. మెట్రో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. భాగ్యనగరంలో ఫ్లెక్సీ పడటం, సిగ్నలింగ్‌ లోపాలు ఇలా పలు సమస్యలతో రైళ్లు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షంతో రహదారులు నీట మునగడంతో మెట్రోలో అయినా సేఫ్‌గా ఇంటికెళ్లొచ్చు అనుకున్న ప్రయాణికులకు ఇక్కట్లు తప్పలేదు. మరోవైపు మెట్రోలో ప్రయాణిస్తున్న ప్రయాణికులు ఎక్కడ ట్రైన్ ఆగిపోతుందో అని ఆందోళన.. ఇంకో వైపు తాము వేచి చూస్తున్న స్టేషన్‌కు ట్రైన్ ఎప్పుడెస్తుందా..? అని జనాలు వెయిటింగ్.. హైదరాబాద్‌లో పరిస్థితి ఇలా ఉంది.

శనివారం ఒక్క రోజే..!

ఒక్క శనివారం నాడే మియాపూర్-మూసాపేట, ఎల్బీనగర్-మూసాపేట, పెద్దమ్మ గుడి-మాదాపూర్, హైటెక్‌సిటీ-నాగోల్‌, కూకట్‌పల్లి, జూబ్లిహిల్స్ ప్రాంతాలతో పాటు పలుచోట్ల సాంకేతిక సమస్యలతో మెట్రో రూళ్లు ఆగిపోయాయి. ఫ్లెక్సీలు తెగిపడి హైటెన్షన్ వైర్లపై పడటం, సిగ్నలింగ్ సమస్యలు, మెట్రోలోని సున్నిత పరికరాలు దెబ్బతిని సేవల్లో అంతరాయం, ఇలా పలు కారణాల వల్ల మెట్రోలు ఎక్కడికక్కడ నిలిచిపోతున్నాయి.

చర్యలు చేపడతాం..!

ఈ సమస్యలపై హైదరాబాద్ మెట్రోరైలు ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. సమస్య నివారణకు చర్యలు చేపడతామన్నారు. రైళ్లలో పరికరాలు మార్చి ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా చేస్తామన్నారు. రైళ్లలో వాడే పరికరాలు కాలుష్యంతో మొరాయిస్తున్నాయని ఆయన చెప్పుకొచ్చారు. భారీగా వీస్తున్న ఈదురుగాలుల థాటికి ఫ్లెక్సీలు ట్రాక్‌పై పడుతున్నాయని.. తద్వారా మెట్రోలు నిలిచిపోతున్నాయన్నారు. ఈ సమస్యలన్నింటికీ పరిష్కార మార్గాలు చూస్తామని ఎన్వీఎస్ రెడ్డి స్పష్టం చేశారు.

More News

ఊహించని మలుపులతో డేంజర్ లవ్ స్టోరి

రెండు ప్రేమ జంటలు తమ ప్రేమ డేంజర్ లో పడినపుడు దానిని కాపాడుకునేందుకు ఎలా ముందుకు సాగారు అన్న కథాంశంతో డేంజర్ లవ్ స్టోరి చిత్రాన్ని తెరకెక్కించారు.

మోదీపై ప్రియాంక సంచలన వ్యాఖ్యలు

ఎన్నికల ప్రచారంలో నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. రాజకీయ నేతల నోటి నుంచి ఎప్పుడేం పలుకులు వస్తాయో..

చంద్రబాబు చరిత్రలో నిలిచిపోతారు: వైసీపీ ఎమ్మెల్యే

ఈవీఎంలు పనిచేయలేదు.. ఈవీఎంలపై నమ్మకం లేదని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడటం అది ప్రజాస్వామ్యంపై నమ్మకం లేని వ్యక్తిగా చరిత్రలోనే నిలిచిపోతారని

పేలుళ్ల నుంచి క్షేమంగా బయటపడ్డ హీరోయిన్ సోదరుడు

శ్రీలంకలో ఆదివారం ఉదయం వరుస బాంబు పేలుళ్లు జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో సుమారు 160 మందికి పైగా ఘటనాస్థలిలోనే కన్నుమూయగా..

రాధిక‌కు త‌ప్పిన ముప్పు

సీనియ‌ర్ న‌టి రాధిక‌కు పెను ప్ర‌మాదం త‌ప్పింది. ఈమె వ్య‌క్తిగ‌త ప‌నుల రీత్యా శ్రీలంకకు వెళ్లారు. అక్క‌డ సిన్నామ‌న్ గ్రాండ్ హోట‌ల్‌లో బ‌స చేశారు.