మెట్రో స్టేషన్ వద్ద కుంగిపోయిన రోడ్డు.. స్పందించిన మెట్రో రైల్ ఎండీ
Send us your feedback to audioarticles@vaarta.com
హైదరాబాద్‌లో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. లాక్‌డౌన్ సమయంలో వేసిన రోడ్లన్నీ ప్రస్తుతం దారుణంగా దెబ్బ తిన్నాయి. మరోవైపు మెట్రో పిల్లర్లు సైతం ప్రమాదపుటంచుకు చేరుకోవడం ఆందోళన కలిగిస్తోంది. మూసాపేట్ మెట్రో స్టేషన్ వద్ద రోడ్డు భారీగా కుంగిపోయింది. మెట్రో పిల్లర్ చుట్టూ నిర్మించిన సర్ఫేస్ వాల్ వరద తాకిడికి పూర్తిగా ధ్వంసమైంది. రెండు మెట్రో పిల్లర్ల చుట్టూ రోడ్డు కుంగిపోవడంతో అక్కడే నీరు నిలిచిపోయింది.
ఇలాంటి భయానక పరిస్థితుల్లోనే మెట్రో రైళ్లు మియాపూర్ వైపు తిరుగుతున్నాయి. దీనిని చూసిన ప్రయాణికులు, స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. రోడ్డు బాగా కుంగిపోవడంతో మూసాపేట్ వద్ద వాహన రాకపోకలకు కూడా అంతరాయం ఏర్పడింది. కాగా.. వరదల కారణంగానైతే మెట్రో పిల్లర్లకు వచ్చిన నష్టమేమీ లేదని మెట్రో రైల్ ఎండీ ఎన్‌వీఎస్‌రెడ్డి స్పష్టం చేశారు.
కూకట్‌పల్లి ఐడీఎల్ చెరువు నుంచి భారీ వరద రోడ్లపైకి చేరిందని, వరదకు మెట్రో పిల్లర్ చుట్టూ ఉన్న మట్టి కొట్టుకుపోయిందని ఎన్‌వీఎస్ రెడ్డి తెలిపారు. మెట్రో విషయంలో వరద ప్రభావంపై ఇంజినీర్లు పర్యవేక్షిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. పిల్లర్లకు ఎలాంటి ప్రమాదం లేదని, వందతులు నమ్మొద్దని ప్రజలకు ఎన్‌వీఎస్ రెడ్డి సూచించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout