మెట్రో స్టేషన్ వద్ద కుంగిపోయిన రోడ్డు.. స్పందించిన మెట్రో రైల్‌ ఎండీ

  • IndiaGlitz, [Thursday,October 15 2020]

హైదరాబాద్‌లో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. లాక్‌డౌన్ సమయంలో వేసిన రోడ్లన్నీ ప్రస్తుతం దారుణంగా దెబ్బ తిన్నాయి. మరోవైపు మెట్రో పిల్లర్లు సైతం ప్రమాదపుటంచుకు చేరుకోవడం ఆందోళన కలిగిస్తోంది. మూసాపేట్ మెట్రో స్టేషన్ వద్ద రోడ్డు భారీగా కుంగిపోయింది. మెట్రో పిల్లర్ చుట్టూ నిర్మించిన సర్ఫేస్ వాల్ వరద తాకిడికి పూర్తిగా ధ్వంసమైంది. రెండు మెట్రో పిల్లర్ల చుట్టూ రోడ్డు కుంగిపోవడంతో అక్కడే నీరు నిలిచిపోయింది.

ఇలాంటి భయానక పరిస్థితుల్లోనే మెట్రో రైళ్లు మియాపూర్ వైపు తిరుగుతున్నాయి. దీనిని చూసిన ప్రయాణికులు, స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. రోడ్డు బాగా కుంగిపోవడంతో మూసాపేట్‌ వద్ద వాహన రాకపోకలకు కూడా అంతరాయం ఏర్పడింది. కాగా.. వరదల కారణంగానైతే మెట్రో పిల్లర్లకు వచ్చిన నష్టమేమీ లేదని మెట్రో రైల్‌ ఎండీ ఎన్‌వీఎస్‌రెడ్డి స్పష్టం చేశారు.

కూకట్‌పల్లి ఐడీఎల్‌ చెరువు నుంచి భారీ వరద రోడ్లపైకి చేరిందని, వరదకు మెట్రో పిల్లర్‌ చుట్టూ ఉన్న మట్టి కొట్టుకుపోయిందని ఎన్‌వీఎస్ రెడ్డి తెలిపారు. మెట్రో విషయంలో వరద ప్రభావంపై ఇంజినీర్లు పర్యవేక్షిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. పిల్లర్లకు ఎలాంటి ప్రమాదం లేదని, వందతులు నమ్మొద్దని ప్రజలకు ఎన్‌వీఎస్ రెడ్డి సూచించారు.

More News

జగన్‌ను సీఎం పదవి నుంచి తొలగించండి: సుప్రీంలో పిటిషన్

ఏపీ సీఎం జగన్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌కు రాసిన లేఖ పెను దుమారాన్నే రేపుతోంది. దీనిపై సీఎం పదవి నుంచి జగన్‌ను తొలగించాలని సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు అయింది.

హీరోయిన్‌తో బోండా ఉమ అంటూ పిక్స్.. పోలీసులకు ఫిర్యాదు

తెలుగుదేశం పార్టీ నేతలు ఎప్పుడు ఎలా దొరుకుతారా? అని అధికార పక్షం నేతలు ఎదురు చూస్తూ ఉంటారు.

ఒకే కుటుంబానికి చెందిన 9 మంది గల్లంతు..

వర్షాలు బీభత్సానికి హైదరాబాద్ సహా చుట్టు పక్కల జిల్లాల్లో ఆస్తి నష్టంతో పాటు... ప్రాణ నష్టం కూడా సంభవిస్తోంది.

విడుదలకి సిద్దమైన 'వ‌ల‌స‌'

కళాకార్ ప్రొడక్షన్స్ సమర్పణలో శ్రావ్య ఫిలిమ్స్ పతాకం పై యెక్కలి రవీంద్ర బాబు నిర్మాణ సారథ్యంలో

'ట్రు` మూవీ టైటిల్ లోగో విడుద‌ల‌!

గ్రీన్ లీఫ్ ఎంటర్టైన్మెంట్స్ నూతన నిర్మాణ సంస్థలో గుణశేఖర్, సురేందర్ రెడ్డి మరియు వై వి ఎస్ చౌదరి దర్శకుల వద్ద అసోసియేట్ డైరెక్టర్